Tuesday, May 16, 2023

Introduction to Biology in Telugu | జీవశాస్త్రం పరిచయం | Student Soula

Introduction to Biology in Telugu | జీవశాస్త్రం పరిచయం | Student Soula

  • జీవుల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని జీవశాస్త్రం (Biology) అంటారు.
  • జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు.
  • జీవశాస్త్రంలో రెండు విభాగాలుంటాయి. అవి: (1) జంతుశాస్త్రం (2) వృక్షశాస్త్రం
  • మొక్కల గురించిన అధ్యయనాన్ని వృక్షశాస్త్రం (Botany) అని, జంతువుల గురించిన అధ్యయనాన్ని జంతుశాస్త్రం (Zoology) అని అంటారు.
  • జీవశాస్త్రం (బయాలజీ) అనే పదం బయోస్ (జీవం), లాగస్ (అధ్యయనం) అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది.
  • జీన్ లామార్క్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 1809లో బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించాడు.
  • జీవశాస్త్ర, జంతుశాస్త్ర పితామహుడు: అరిస్టాటిల్
  • వృక్షశాస్త్ర పితామహుడు: థియోఫ్రాస్టస్




No comments:

Post a Comment