- పోషక పదార్థాలు (Nutrients) అనేవి శరీరానికి కావలసిన శక్తినివ్వడంలో, పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
- వీటి అధ్యయనం: ట్రోఫాలజీ
- పోషకాలను సేకరించడాన్ని పోషణ (Nutrition) అంటారు.
స్థూల పోషకాలు (Macro-Nutrients)
- ఇవి అధిక మొత్తంలో ఆహారంలో అవసరం అయ్యే పదార్థాలు
పిండి పదార్థాలు (Carbohydrates):
- సాధారణంగా పిండి పదార్థాలను చక్కెర అంటారు.
- ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
- ఇవి ఒక రోజుకి కావలసిన పరిమాణం: 600 గ్రాం
- ఒక గ్రాం కార్బోహైడ్రేట్స్ నుండి లభించే శక్తి: 4 కిలో కేలరీ (Kcal)
- వీటిని గుర్తించడానికి చేసే పరీక్ష: Iodine Test.
- ఈ పరీక్షలో పిండి పదార్థాలు నీలి రంగులోకి మారును.
- చక్కెర ద్రవాల గాఢతలను కొలిచే పరికరం: సకారీ మీటర్
- ముఖ్యమైన పిండి పదార్థాలు:
- మోనోశాకరైడ్స్
- డైశాకరైడ్స్
- పాలిశాకరైడ్స్
- ఒకే చక్కెర అణువులచే ఏర్పడును.
- ఇవి సులభంగా నీటిలో కరిగి శక్తిని అందిస్తాయి.
- ఉదా: (a) గ్లూకోజ్ (b) ఫ్రక్టోజ్
- (a) గ్లూకోజ్:
- దీనిని Grape Sugar, Blood Sugar అంటారు.
- ఇది క్రీడాకారులకు తక్షణ శక్తినిచ్చును.
- దీన్ని క్షయకరణ చక్కెర అంటారు.
- రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై, దీనిపై ఇన్సులిన్ నియంత్రణ లేనప్పుడు చక్కెర వ్యాధి వస్తుంది.
- (b) ఫ్రక్టోజ్:
- ఇది ప్రపంచంలో అతి తియ్యని చక్కెర.
- దీనిని Fruit Sugar, Honey Sugar అంటారు.
- ఇవి రెండు చక్కెర అణువులచే ఏర్పడును.
- కావున నీటిలో కరగడానికి కొంచెం సమయం పడుతుంది. ఇవి సంశ్లిష్ట చక్కెరలు.
- ఉదా: (a) సుక్రోజ్ (b) లాక్టోజ్ (c) మాల్టోజ్
- (a) సుక్రోజ్:
- ఇది రెండవ అత్యంత తియ్యని చక్కెర.
- చెరకు నుండి లభించుటవల్ల Cane Sugar అని, నిత్య జీవితంలో వాడడంతో Table Sugar అనీ అంటారు.
- Beet Root, Potato నుండి కూడా సుక్రోజ్ ను తయారుచేస్తారు.
- (b) లాక్టోజ్:
- ఇది పాలకు తెలుపు రంగునిచ్చును. కావున Milk Sugar అంటారు.
- (c) మాల్టోజ్:
- ఇది బార్లీ గింజల్లో ఉండడంవల్ల Malt Sugar అంటారు.
- దీనిని ఆల్కహాల్ తయారిలో ఉపయోగిస్తారు.
- వీటిలో అనేక గ్లూకోజ్ అణువులు ఒకదానితో మరొకటి బంధించబడి ఉంటాయి.
- ఇవి సులభంగా నీటిలో కరగవు.
- ఇవి చక్కెరలు కావు.
- ఉదా: (a) సెల్యూలోజ్ (b) స్టార్చ్ (c) గ్లైకోజన్
- (a) సెల్యూలోజ్:
- ప్రపంచంలో అతి ఎక్కువగా ఉండే సహజ పాలిమర్.
- ఇది మొక్కలలోని కణకవచంలో ప్రధాన పదార్థం.
- ఇది మానవుడు వంటి మాంసాహారులలో జీర్ణం కాదు. కారణం ఎంజైమ్ లోపం.
- (b) స్టార్చ్:
- ఇది మొక్కలలో మాత్రమే ఉండి, జంతువులలో లోపించును.
- ఉదా: వరి, గోధుమ, మొక్కజొన్న, పొటాటో
- (c) గ్లైకోజన్:
- ఇది జంతువులలో మాత్రమే ఉండి, మొక్కలలో లోపించును.
- ఇది కాలేయం, కండరాలలో నిల్వ ఉండును.
మాంసకృత్తులు (Proteins):
- ఒక గ్రాం మాంసాకృత్తులు నుండి లభించే శక్తి: 4 కిలో కేలరీ (Kcal)
- ఒక రోజుకి కావాలసినవి: 70 - 100 గ్రాం
- ఇవి శరీర నిర్మాణానికి అవసరం. కావున వీటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అంటారు.
- వీటిని తయారుచేసే కణాలోని భాగం: రైబోజోమ్.
- కావున రెబోజోమ్ ను ప్రోటీన్ ఫ్యాక్టరీ అంటారు.
- అతి ఎక్కువ ప్రోటీన్లను కలిగిన,
- మొక్క: సోయాబీన్
- జీవి: స్పైరులీనా (నీలి అకుపచ్చ శైవలం)
- జంతు పదార్థం: మాంసం
- అమైనో ఆమ్లాలు:
- ఇవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల ప్రోటీన్స్ ఏర్పడును.
- చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం: హిస్టడిన్
ప్రోటీన్ పేరు | ఉండే ప్రదేశం |
---|---|
హిమోగ్లోబిన్ | రక్తంలోని RBC |
అల్బుమిన్ | గుడ్డులోని తెల్లసొన |
అల్బుమిన్, గ్లోబ్యులిన్, ఫైబ్రినోజెన్ |
రక్తంలోని ప్లాస్మా |
కెసిన్ | పాలు |
ఫైబ్రోయిన్, సిరిసిన్ | పట్టుదారం |
మయోసిన్, ఆక్టీన్ | కండరాలు |
హిరుడిన్ | జలగ లాలాజలం |
ఆస్టిన్ | ఎముకలు |
కొల్లాజెన్ | చర్మం |
కాండ్రిన్ | మృదులాస్థి |
కెరాటిన్ | చర్మం, వెంట్రుకలు |
కొవ్వులు (Lipids):
- ఒక గ్రాం కొవ్వుల నుండి లభించే శక్తి: 9.3 Kcal
- ఈ శక్తి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కన్నా చాలా ఎక్కువ.
- ఈ శక్తి భవిష్యత్ అవసరాల కొరకు శరీరంలో నిల్వ చేయబడి ఉంటుంది.
- ఒక రోజుకు కావాలసినవి: 50 గ్రాం
- ఇవి నీటిలో కరగవు. కానీ క్లోరోఫామ్, ఈథర్, బెంజీన్ వంటి కర్బన ద్రావణాల్లో కరుగుతాయి.
- కొవ్వు ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించేవి: ఫాటీ ఆమ్లాలు, గ్లిజరాల్
- వీటిని గది ఉష్ణోగ్రత వద్ద నూనెలు అంటారు.
- కొవ్వులు నీటిలో కరిగే విధంగా మార్చే ప్రక్రియ: ఎమల్సీకరణం
- కొవ్వు ఆమ్లాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
- (1) అసంతృప్త కొవ్వు ఆమ్లాలు
- (2) సంతృప్త కొవ్వు ఆమ్లాలు
(1) అసంతృప్త కొవ్వు ఆమ్లాలు:
- ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కావున బయట నుంచి ఆహారంగా తీసుకోవాలి.
- ఇవి రక్త ప్రసరణను సాఫీగా జరిగేటట్లు చేయును. కావున ఇవి ఆరోగ్యరీత్యా ఉపయోగకరం.
(2) సంతృప్త కొవ్వు ఆమ్లాలు:
- ఇవి శరీరంలో ఉత్పత్తి అగును.
- ఇవి ఆరోగ్యరీత్య మంచివి కావు.
- ఇవి చెడు కొలెస్టిరాల్ శాతాన్ని పెంచి హృదయం పై ప్రభావం చూపును.
- ఇది జంతువులలో ఎక్కువగా ఉండును.
- మొక్కలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు హైడ్రోజన్ వాయువును కలిపి వాటిని సంతృప్త స్థితిలోకి మార్చి వనస్పతి (Vegetable Ghee) ని తయారుచేసే ప్రక్రియను హైడ్రోజినేషన్ అంటారు. దక్షిణాసియాలో వనస్పతిని డాల్డా అనే బ్రాండ్ పేరుతో వినియోగిస్తున్నారు.
కొలెస్టిరాల్:
- శక్తినిచ్చే పదార్థాలైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులను ఎక్కువగా తీసుకొని పని తక్కువగా చేస్తే, ఎక్కువ శక్తి కొలెస్టిరాల్ రూపంలోకి మార్చబడును.
- ఇది అడిపోజ్ అనే కణజాలంలో నిల్వ చేయబడుతుంది.
- కొలెస్టిరాల్ లేనిది: వేరుశెనగ నూనె
స్థూలకాయత్వం:
- ఇది వ్యాధి కాదు, పోషకాహార సమస్య మాత్రమే
- వీరికి మంచి ఆహారం: పుట్టగొడుగులు (Mushrooms)
- వీరికి కొవ్వులను తీసివేసే సర్జరీ: బేరియాట్రిక్ సర్జరీ మరియు లైపోసక్షన్.
- ప్రపంచంలో మొదటగా Fat Tax ను విధించిన దేశం: డెన్మార్క్ (2012 లో)
సూక్ష్మ పోషకాలు (Micro-Nutrients)
- ఇవి తక్కువ మొత్తంలో ఆహారంలో అవసరం అయ్యే పదార్థాలు.
ఖనిజాలు (Minerals):
- ఇవి శరీర పెరుగుదలకు అవసరం.
- ఇవి మొత్తం శరీర బరువులో: 4%
- మానవ శరీరానికి అవసరమయ్యే ఖనిజ మూలకాల సంఖ్య: 54
- వీటిలో అధికంగా ఉండే మూలకం: కాల్షియం (1.5-2%)
- ఇవి రెండు రకాలు:
- (1) స్థూల మూలకాలు
- (2) సూక్ష్మ మూలకాలు
(1) స్థూల మూలకాలు (Macro Elements):
- స్థూల పోషకాలు: C, H, O, N, P, K, Ca, Mg, Na, S, Mn
- ఇవి శరీర జీవక్రియకు ఎక్కువ మొత్తంలో అవసరం.
- మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం: కార్బన్ (C)
- మానవ శరీరంలో అత్యల్పంగా ఉండే మూలకం: మాంగనీస్ (Mn)
- మనవ శకీరంలో అధికంగా ఉండే వాయువు: ఆక్సిజన్ (O2)
- వాతావరణంలో అతి తేలికైనా వాయువు: హైడ్రోజన్ (H)
- నైట్రోజన్(N), పాస్పరస్ (P), పొటాషియం (K)లను ప్రధాన మూలకాలు అంటారు. ఇవి సాధారణంగా నేలలో లభించవు.
- C, H, O మూలకాలచే జీవి ఏర్పాటు జరుగును.
నైట్రోజన్ (N):
- మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి అతిముఖ్యమైన మూలకం.
- మొక్కలు నైట్రోజన్ ను లవణాల రూపంలో (నైట్రేట్స్) శోషణం చేసుకోవడాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు.
- దీని లోపం ఉన్న నేలల్లో కీటకాహార మొక్కలు పెరుగును.
- ఇది వాతావరణంలో అధికంగా ఉండే వాయువు (78.028%)
పాస్పరస్ (P):
- ఇది నేలలో పాస్పేట్ రూపంలో మొక్కకు అందును.
- జంతువులలో కాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల ఎర్పాటులో తోడ్పడును మరియు కేంద్రకామ్లాల (DNA & RNA) తయారిలో పాల్గొనును.
- దీని లోపంవల్ల మొక్కలలో పెరుగుదల తగ్గడం, క్లోరోసిస్, జంతువులలో రికెట్స్ వచ్చును.
- ఇది పాలు, గడ్డు, పప్పులు, మాంసం, కాలేయంలలో దొరుకును.
పొటాషియం (K):
- ఇది నాడీ, కండర ప్రక్రియలో ప్రోటీన్స్, గ్లైకోజన్ తయారిలో పాల్గొనును.
- దీని లోపంవల్ల హైపర్ క్యాలిమియా, మూత్రపిండాలు చెడిపోవడం, గుండె పనిచేయకపోవడం వంటి సమస్యలు కలుగును.
- ఇది కోడి మాంసం, పంది మాంసం, నారింజ రసం, బంగాళదుంపలలో అధికంగా ఉండును.
కాల్షియం (Ca):
- ఇది జంతువులలో పాల ఉత్పత్తి, కండర-నాడీ ప్రక్రియలు, రక్తం గడ్డకట్టడానికి తోడ్పడును.
- దీని లోపంవల్ల మానవులలో రికెట్స్, అస్టియో మలేషియా, మొక్కలలో గిడసబారడం, పుష్పాలు సుప్తావస్థలో ఉండటం జరుగును.
- ఇది పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, రాగులు, మాంసం, క్యాబేజీ లలో దొరుకును.
- ఇది శరీరంలో ఎముకలు, దంతాలలో అధికంగా ఉండే లోహా మూలకం.
- శరీరంలో కాల్షియం స్థాయిని స్థిరపరిచేది: పారాథార్మోన్
- గర్బిణి స్త్రీలలో అధికంగా లోపించే మూలకాలు: Ca, Fe
మెగ్నీషియం (Mg):
- విధి: కొవ్వులు, ప్రోటీన్ల జీవక్రియ
- దీని లోపంవల్ల నాడీ వ్యవస్థ అధికంగా స్పందిచడం, మూర్చ వ్యాధి కలగడం కనబడును మరియు మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగును కోల్పోతాయి.
- ఇది కోకో గింజలు, సోయాబీన్ లలో లభించును.
- ఆకుల్లోని పత్రహరిత నిర్మాణానికి అతిముఖ్య కేంద్ర మూలకం.
సల్ఫర్ (S):
- విధి: ఇన్సులిన్, ప్రోటీన్లు, B1, B7 విటమిన్స్ తయారీ
- దీని లోపంవల్ల టీ మొక్కలలో పత్రాలు ఏర్పడకపోవడం, క్లోరోసిస్, లెగ్యూమ్ మొక్కలలో వేరుబుడిపెలు ఏర్పడకపోవడం జరుగును.
- ఇది ధాన్యాలు, జున్ను, గోధుమ మొలకలలో ఉండును.
సోడియం (Na):
- ఇది నాడీ ప్రచోదనానికి, శరీర ద్రవాల సమతుల్యతకు అవసరం.
- దీని లోపంవల్ల కండర కొంకర్లు, అలసట, నీరసం, శరీర బరువు తగ్గడం, వికారం, తలనొప్పి కలుగును.
- ఇది ఉప్పు, జొన్నలు, ఆల్చిప్పల పెంకులు, గోధుమ మొలకలలో లభించును.
క్లోరిన్ (Cl):
- విధి: రక్తంలో వాయువులను, ఇతర పదార్థాలను సమతుల్యపరచడం .
- దీని లోపంవల్ల ఆకలి మాంధ్యం, జఠర సంబంధ వ్యాధులు కలుగును.
- ఇది ఉప్పులో లభించును.
- నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మ జీవులను చంపేయడాన్ని క్లోరినేషన్ అంటారు.
(2) సూక్ష్మ మూలకాలు (Micro Elements):
- సూక్ష్మ పోషకాలు: మాంగనీస్, కోబాల్ట్, కాపర్, Fe, I, F, Zn, B
- ఇవి శరీర జీవక్రియకు తక్కువ మొత్తంలో అవసరం.
- హిమోగ్లోబిన్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి ఆక్సిజన్ ను రవాణా చేస్తుంది.
- ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
- దీని లోపంవల్ల జంతువులలో ఎనీమియా (రక్తహీనత), మొక్కలలో పెరుగుదల మందగించడం జరుగును.
- ఇది మానవుని రక్తంలో అధికంగా ఉండే లోహం.
- శరీరానికి అవసరమైన ఇనుము ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది.
అయోడిన్ (I):
- థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం.
- దీని లోపంవల్ల గాయిటర్ వ్యాధి కలుగును.
- చేపలు, రొయ్యలు, పీతలు, ఉప్పులలో ఇది లభించును. రొయ్యలలో అధికంగా లభించును.
- భారత ప్రభుత్వం మొదటగా శాసనం చేసినా మూలకం ఇది
ఫ్లోరిన్ (F):
- దంతాలు, ఎముకలు, దంతాలపై గట్టి ఎనామిల్ ఉత్పత్తికి ఇది అవసరం.
- నీటిలో దీని స్థాయి పెరిగితే ఫ్లోరోసిస్ వచ్చును మరియు ఎనామిల్ విచ్ఛిత్తి కావడం జరుగును.
- ఇది నీటి ద్వారా, సముద్ర ఆహారం ద్వారా లభించును.
- నీటిలో ఫ్లోరిన్ ను తగ్గించడం: డీఫ్లోరిడేషన్.
కోబాల్ట్ (Co):
- ఇది విటమిన్ B12 లో అతర్భాగం.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహకరిస్తుంది.
- దీని లోపంవల్ల హానికర ఎనీమియా కలుగును.
- ఇది ధాన్యాలు, గింజలు, ఆకుకూరలు, కూరగాయలలో లభించును.
కాపర్ (Cu):
- ఎర్ర రక్తకణాల తయారీ, విటమిన్ తయారీలో పాల్గొనును.
- దీని లోపంవల్ల మొక్కలలో డైబాక్ వ్యాధి, జంతువులలో అలసట, నీరసం కలుగును.
- పాలు, చేపలు, గుడ్డు, మాంసంలో లభించును.
జింక్ (Zn):
- విధి: ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధి, గాయాలు మాన్పడం, సాధారణ దృష్టి.
- దీని లోపంవల్ల ఆకులు చిన్నవిగా ఉండడం, జననాంగాల క్షీణత, మరుగుజ్జుతనం వచ్చును.
- కాలేయం, గుడ్డు, మూత్రపిండాలు, పప్పులలో ఇది లభించును.
బోరాన్ (B):
- ఇది నీరు మరియు కాల్షియం శోషణకు ఉపయోగపడును.
- లోపం: కాలీఫ్లవర్ ముడతలు, హార్ట్ రాట్ వ్యాధి, ఆకులు విశ్రాంతి.
విటమిన్స్ (Vitamins):
- జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు.
- ఇవి శక్తి ప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
- వీటి అధ్యయనం: విటమినాలజీ
- గ్రీకు భాషలో విటా అనగా జీవితం
- F.G.Hopkins 1912లో పాలపై పరిశోధన చేసి దానిలో పెరుగదల పదార్థాన్ని గర్తించి, ఆ పదార్థాన్ని సహాయ / అదనపు కారకం అని పిలిచాడు.
- విటమిన్ అనే పేరు పెట్టింది: Casimir Funk (1912లో)
- ఇవి రెండు రకాలు:
- కొవ్వులో కరిగే విటమిన్లు: A, D, E, K
- నీటిలో కరిగే విటమిన్లు: B, C
విటమిన్ - A
- రసాయనిక నామం: రెటినాల్
- సాధారణ నామం: యాంటీ గ్జెరాఫ్తాల్మియా
- ఉపయోగం: కంటి చూపుకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండటానికి, వ్యాధుల నివారణకు ఇది తోడ్పడును.
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: రేచీకటి (నిక్టోలోపియా), పొడికళ్ళు (జిరాఫ్తాల్మియా), కార్నియా పగలడం, చర్మం గరుకుగా మారడం, పొలుసులుగా ఊడిపోవడం జరుగును.
- ప్రపంచంలో అధికంగా విటమిన్ - A కలిగిన,
- పదార్థం: క్యారెట్
- ఆకుకూర: బచ్చలి (Spinach)
- ఫలం: బొప్పాయి (Papaya)
- పాలు: ఆవుపాలు
- మొక్కలలో A విటమిన్ β-Kerotene (Pro Vitamin-A) రూపంలో ఉండి ప్రేగు, కాలేయంలలో A విటమిన్ గా మారును.
- క్యారెట్ ఆరెంజ్ రంగులో ఉండటానికి కారణం: β Kerotene
- పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణం: A విటమిన్
విటమిన్ - D
- రసాయనిక నామం: కాల్సిఫెరాల్
- సాధారణ నామం: Sunshine Vitamin, యాంటీ రికెటిక్ విటమిన్, ఉచిత విటమిన్, హార్మోన్ లాంటి విటమిన్
- ఉపయోగం: ఆహారం ద్వారా లభించిన Ca, P లను ఎముకలలోకి, దంతాలలోకి పంపించి గట్టిగా ఉంచడంలో తోడ్పడును.
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: రికెట్స్, అస్టియో మలేషియా
- సూర్య కాంతి చర్మంపై పడినప్పుడు చర్మం క్రింద ఉండే కొలెస్టిరాల్ అనే క్రొవ్వు విటమిన్ - D గా మారును.
- ఇది శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్.
విటమిన్ - E
- రసాయనిక నామం: టోకోఫెరాల్
- సాధారణ నామం: Beauty Vitamin, యాంటీ స్టెరిలిటీ విటమిన్ (వంధ్యత్వ నిరోధక విటమిన్)
- ఉపయోగం: ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఇది అవసరం
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: వంధ్యత్వం (ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం), RBC ల విచ్ఛిత్తి, కండర క్షీణత
- గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి దీన్ని ఇవ్వాలి.
విటమిన్ - K
- రసాయనిక నామం: ఫిల్లో క్వినోన్, నాఫ్తో క్వినోన్, ఫైటోనాడియోన్
- సాధారణ నామం: రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్
- ఉపయోగం: రక్తాన్ని గడ్డకట్టించడం (3-6 నిమిషాల్లో)
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: హేమరేజియా (అధిక రక్తస్రావము, రక్తం గడ్డకట్టకపోవడం, క్లోమం దెబ్బతినడం)
- అప్పుడే పుట్టిన శిశువులో దీని లోపం ఎక్కువ. కావున సర్జరీ సమయంలో తల్లికి విటమిన్ - K ఇవ్వాలి.
- బాంబు పేలుళ్లు, కత్తిపోట్ల వల్ల రక్తం గడ్డకట్టడానికి 8 నిమిషాలు పట్టును.
B Complex Vitamins:
- ఇవి నిత్య జీవితంలో రోజువారి ఆహారంలో లభించును.
- ఇవి ముఖ్యంగా B1, B2, B3, B5, B6, B7, B9, B12.
- పై అన్ని రకాల విటమిన్స్ (B12 తప్పా) బొబ్బర్లు (Cowpea) విత్తనాలలో లభించును.
- Beer లో ఉండే విటమిన్స్: B3, B6, B9, B12
విటమిన్ - B1
- రసాయనిక నామం: థయమిన్
- సాధారణ నామం: Anti-Neurotic Vitamin, Anti-Beriberi Vitamin
- ఉపయోగం: కార్బోహైడ్రేట్ జీవక్రియ
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: బెరిబెరి (హృదయ స్పందన సక్రమంగా జరగకపోవడం)
- ఇది ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో లోపించును.
- దీనిలో సల్ఫర్ మూలకం కలదు.
విటమిన్ - B2
- రసాయనిక నామం: రిబోఫ్లావిన్
- సాధారణ నామం: Yellow Vitamin
- ఉపయోగం: కణ ఆక్సీకరణ (శ్వాసక్రియ), క్షయకరణ (కిరణజన్య సంయోగ క్రియ) చర్యలు
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: కిలోసిస్ (నోరు మూలల్లో పగిలి రక్తస్రావం జరగడం), గ్లాసైటిస్ (నాలుక ఎర్రగామారి పుండ్లు ఏర్పడడం)
- ఆవుపాలు, కాలేయం మరియు గుడ్డు పచ్చసొన లేత పసుపు రంగుకు కారణం ఇదే.
విటమిన్ - B3
- రసాయనిక నామం: నియాసిన్, నికోటినిక్ ఆమ్లం
- సాధారణ నామం: యాంటీ పెల్లాగ్రా విటమిన్
- ఉపయోగం: Carbohydrates, Proteins, Lipids (CPL) జీవక్రియ
- ఇది నైట్రోజన్ సహిత విటమిన్.
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు:
- పెల్లాగ్రా: చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోవడం
- మతిమరుపు: జ్ఞాపక శక్తి లోపం
- నిద్రలేమి: నిద్రలో లేచి నడవడం
- డయేరియా/ అతిసారం: శరీరంలోని నీరు, లవణాలు విరేచనాల రూపంలో కోల్పోవడం. ప్రపంచంలో అధికంగా చిన్నపిల్లల మరణానికి కారణం ఇదే. దీన్ని కలిగించే వైరస్: రోటా వైరస్.
విటమిన్ - B5
- రసాయనిక నామం: పాంటోథినిక్ ఆమ్లం
- సాధారణ నామం: ఈస్ట్ కారకం
- ఉపయోగం: CPL జీవక్రియ
- దీని లోపంవల్ల కాళ్ళలో మంటగా ఉంటుంది.
విటమిన్ - B6
- రసాయనిక నామం: పైరిడాక్సిన్
- సాధారణ నామం: యాంటీ ఎనీమియా విటమిన్ (రక్తహీనత నిరోధక విటమిన్)
- ఉపయోగం: ప్రోటీన్ల జీవక్రియ, హిమోగ్లోబిన్ మరియు ప్రతిరక్షకాల తయారీ
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: ఎనీమియా (రక్తహీనత)
విటమిన్ - B7
- రసాయనిక నామం: బయోటిన్
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: కండర నొప్పులు, అలసట, నాడీ మండల వ్యాధులు, మానసిక సమస్యలు.
- ఇది సల్ఫర్ ను కలిగి ఉంటుంది.
- దీన్ని విటమిన్ - H అంటారు.
విటమిన్ - B9
- రసాయనిక నామం: ఫోలిక్ ఆమ్లం
- దీని లోపంవల్ల మానసిక రుగ్మతగల శిశువు జన్మించును మరియు కడుపులో మంట, మాక్రోసైటిక్ ఎనీమియా వచ్చును.
- ఇది కూడా ఐరన్ కలిగి ఉండటంవల్ల గర్భిణి స్త్రీలకు ఎక్కువగా అవసరం.
- ఫోలిక్ ఆమ్లం వేడి చేస్తే నశించును.
విటమిన్ - B12
- రసాయనిక నామం: సైనకోబాలమిన్
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: పెర్నిషియస్ ఎనీమియా (హానికర రక్తహీనత)
- ఇది కోబాల్ట్ అనే లోహ మూలకాన్ని కలిగి ఉంటుంది.
- ఇది ఎనర్జీ డ్రింక్స్ లో అధికంగా ఉండును.
- జంతు ఆహార ఉత్పత్తులలో మాత్రమే లభ్యమయ్యే ఏకైక విటమిన్.
- ఇది వర్షపు నీటిలో ఉండే విటమిన్.
విటమిన్ - C
- రసాయనిక నామం: అస్కార్బిక్ ఆమ్లం
- సాధారణ నామం: Slimness Vitamin, యాంటీ స్కర్వీ విటమిన్.
- దీని లోపంవల్ల వచ్చే వ్యాధులు: స్కర్వీ (చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరగడం), కండరాల నొప్పి, చర్మం పగలడం, ఎముకల నొప్పి.
- ప్రపంచంలో విటమిన్ - C అధికంగా ఉండే ఫలం: ఉసిరి
- తొక్క తీసి బాగా కడిగినపుడు కూడా విటమిన్ - C కోల్పోవును.
- ఇది జంతు సంబంధ ఆహార పదార్థాలలో (పాలు, గుడ్లు, మాంసం) లభించదు.
- గాయాలు మానడంలో, విరిగిన ఎముకలు త్వరగా మానడంలో ఇది తోడ్పడును.
- విటమిన్ - C వేడి చేస్తే నశించును.
- విటమిన్ - C జలుబుకు వ్యతిరేకంగా, తరువాతి కాలంలో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయునని తెలిపింది: లీనస్ పౌలింగ్
పాలు (Milk):
- పాలల్లో ఉండే;
- పిండి పదార్థం (చక్కెర): లాక్టోజ్ (పాల తెలుపుకు కారణం)
- ప్రోటీన్: కెసిన్ (ఇది స్కందనం చెంది పెరుగును ఏర్పచును)
- కొవ్వు: లాక్టిక్ ఆమ్లం (పులుపు రుచికి కారణం)
- ఖనిజ మూలకం: కాల్షియం (పాల ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం)
- విటమిన్: C విటమిన్ తప్ప అన్ని విటమిన్ ఉంటాయి
- ఎంజైమ్: రెనిన్ (ఇది 5 సంవత్సరాల వరకు చిన్నపిల్లలలో పాలను పెరుగుగా మార్చును)
- బాక్టీరియా: లాక్టోబాసిల్లస్ (పాలను పెరుగుగా మార్చును)
శ్వేత విప్లవం (White Revolution):
- ఇది పాలు మరియు దాని ఉత్పత్తులను పెంచడానికి చేపట్టినది.
- దీనిలో భాగంగా Operation Flood అనే కార్యాక్రమాన్ని మొదటగా కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1970లో ప్రారంభించారు.
- Father of White Revolution, Father of Operation Flood, Milkman of India: వర్గీస్ కురియన్
- ఇతను గుజరాత్ లోని ఆనంద్ అనే పట్టణంలో NDDB (National Dairy Development Board), Amul Milk Factory లను స్థాపించాడు.
పాశ్చరైజేషన్:
- ఈ ప్రక్రియను కనుగొన్నది: లూయిస్ పాశ్చర్ (ఫ్రాన్స్)
- ఉద్దేశ్యం: పాలను ఎక్కువ కాలం నిల్వచేయడం
- పాలను వేడిచేయడం ద్వారా దానిలోని సూక్ష్మ జీవులను (లాక్టోబాసిల్లస్) క్రియారహితం చేస్తారు.
- పాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడంవల్ల దానిలోని Ca, P, B2 విటమిన్స్ కొంతవరకు నష్టపోతాయి.
ముఖ్యమైన అంశాలు:
- సమతుల్య / సంపూర్ణ / సమీకృత ఆహారం: పాలు
- అంతర్జాతీయ పాల దినోత్సవం: జూన్ 1 (2001 నుంచి)
- జాతీయ పాల దినోత్సవం: నవంబర్ 26 (2014 నుంచి) (వర్గీస్ కురియన్ జన్మదినం గుర్తుగా)
- పాలు చిక్కగా ద్రవరూపంలో ఉండి కొవ్వులు తేలియాడుతున్నట్లుగా ఉండడంవల్ల దీనిని ఎమల్షన్ అంటారు.
- శిశువు జన్మించిన తర్వాత మొదట ఇచ్చే పాలను కొలోస్ట్రం అంటారు.
- తల్లి పాలలో అత్యధికంగా ఉండు మూలకం: ఇనుము
- WHO ప్రకారం మొదటి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు అవసరం.
- పాల స్వచ్ఛతను కొలిచే పరికరం: లాక్టోమీటర్
- ఆవు పాల కంటే గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ
- ఆవు పాలు లేత పసుపు రంగుకు కారణం: B2 విటమిన్ & బీటా కెరోటిన్
గుడ్డు (EGG):
- గుడ్డు పెంకులో: కాల్షియం కార్బొనేట్ (CaCO3)
- తెల్లసొన: అల్బుమిన్ అనే ప్రోటీన్
- పచ్చసొన: కొలెస్టిరాల్ అన్ కొవ్వు
- గుడ్డు పచ్చసొన పసుపు రంగులో ఉండడానికి కారణం: జాంథోఫిల్స్ & B2 విటమిన్
- ఖనిజ మూలకాలు: Ca, P, S (కాల్షియం, పాస్ఫరస్, సల్ఫర్)
- ఇందులో కార్బోహైడ్రేట్స్ లోపించి ఉన్నాయి.
- ఇందులో విటమిన్ C తప్ప అన్నీ ఉన్నాయి.
- గుడ్ల ఉత్పత్తి: సిల్వర్ రివల్యూషన్
- Father of Poultry: B.V.RAO
- ఇతని ఆధ్వర్యంలో 1982లో న్యూఢిల్లీలో స్థాపించిన సంస్థ: NECC (National Egg Co-ordination Committee)
- మాంసం కోసం పెంచే కోళ్ళు: బ్రాయిలర్స్
- గుడ్ల కోసం పెంచే కోళ్ళు: లేయర్స్
- కోడి గుడ్డు పొదిగే కాలం: 21 రోజులు (at 35-37.5 ℃)
- చలికాలంలో కోళ్ళు గుడ్లు ఎక్కువగా పెట్టును.