Saturday, April 22, 2023

History of Modi's Mann Ki Baat in Telugu | శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ (మనసులో మాట) | Student Soula

History of Modi's Mann Ki Baat in Telugu | శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ (మనసులో మాట) | Student Soula


మన్ కీ బాత్ (Mann Ki Baat):
  • మన్ కీ బాత్ అనేది హిందీ పదం. దీని అర్థం మనసులో మాట.
  • ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసగించే రేడియో కార్యక్రమం.
  • ప్రధానమంత్రికి పౌరులకు మధ్య నేరుగా సంబంధం ఏర్పరచడమే మన్ కీ బాత్ ప్రధాన ఉద్దేశ్యం.
  • ఇది ఆలిండియా రేడియో (AIR) కు చెందిన ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమవుతుంది. దీనినే దూరదర్శన్ ఛానళ్లు మరియు వివిధ ప్రైవేట్ ఉపగ్రహ ఛానళ్లు ప్రసారం చేస్తాయి.
  • భారతదేశంలో టెలివిజన్, వార్తాపత్రికలు మరియు సామాజిక మాధ్యమాలు ఇప్పటికీ ప్రతీచోట అందుబాటులో లేవు. అదే రేడియో అయితే ప్రతీచోట ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో సైతం విస్తృతంగా అందుబాటులో ఉండడంవల్ల ఈ కార్యక్రమానికి మాధ్యమంగా రేడియోను ఎంచుకున్నారు.
  • ప్రజలు తమ ఆలోచనలను ప్రధానమంత్రితో పంచుకోవాలంటే MyGov లేదా NaMo యాప్/ వెబ్సైట్ ల ద్వారా లేదా 1800117800 లేదా 1921 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా పంచుకోవచ్చు.
  • ఇలా ప్రజల నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాలను మన్ కీ బాత్ లో ప్రధాని ప్రస్తావిస్తారు. ఈ కార్యక్రమం మధ్యలో ప్రధాని అప్పుడప్పుడు టెలిఫోన్ లో ప్రజలతో సంభాషిస్తుంటారు.
  • ఈ కార్యక్రమంలోని ప్రసంగాల్లో ఉదాత్తంగా వ్యవహరించిన సామాన్య ప్రజలను ఎన్నో సందర్భాల్లో ఆయన అభినందించారు. వాతావరణ విపత్తుల నుంచి ఆరోగ్యం, పారిశుద్ధ్యం దాకా ఎన్నో మౌలిక సమస్యలపై మాట్లాడారు. ఎన్నో నిజ జీవిత గాధలను, విశిష్ట అనుభవాలను వెల్లడించారు.
  • ఈ కార్యక్రమంలోని ప్రసంగాల్లో ప్రజా జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అంశాలను తీసుకుంటూ వాటిపై కార్యాచరణకు ప్రధాని మోదీ పిలుపిస్తుంటారు. దేశం కోసం పాటుపడే విధంగా ప్రజలను ఉత్సాహ పరుస్తారు. అందుకో ప్రతీ మన్ కీ బాత్ ప్రసంగం అశేష జనాధరణను చూరగొంటుంది. వేలకొద్ది సానుకూల స్పందనలను అందుకొంటోంది.
  • మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ఇచ్చిన కొన్ని సందేశాలు జనోద్యమంగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సెల్ఫీ విత్ డాటర్, ఇన్ క్రెడిబుల్ ఇండియా, ఫిట్ ఇండియా, సందేశ్ టు సోల్జర్స్, హర్ ఘర్ తిరంగా వంటివి దీనికి కొన్ని ఉదాహరణలు.
  • మొదట రేడియో ప్రసంగంగా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పడు ప్రతినెలా చివరి ఆదివారం నాడు బహు భాషల్లో, బహు  మాధ్యమాల్లో ప్రసారమవుతోంది.
  • మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ 3 అక్టోబర్ 2019న ప్రసారమయింది.
  • నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రిగా (2014-2019) ఉన్నప్పుడు మన్ కీ బాత్ 53 ఎపిసోడ్స్ జరిగాయి. 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 'మన్ కీ బాత్ 2.O' పేరుతో మళ్లీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • Website: www.pmonradio.nic.in
  • మన్ కీ బాత్ వీడియోలు (తెలుగులో)

Edition/
Episode
Part Date
1 1 3rd October 2014
25 25 30th October 2016
50 50 25th November 2018
53 53 24th February 2019
54 1 30th June 2019
75 22 28th March 2021
100 47 30thApril 2023



No comments:

Post a Comment