రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష:
- మోడీ అనే ఇంటి పేరును కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ జిల్లా కోర్టు 23 మార్చ్ 2023న రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
- రాహుల్ అభ్యర్థన మేరకు ఈ కేసులో వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసి, ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలుకు వీలుగా 30 రోజుల సమయం ఇచ్చింది.
కేసు నేపథ్యం ఏమిటి?
- సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో 13 ఏప్రిల్ 2019న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీని కూడా దృష్టిలో పెట్టుకుని "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది" అని తీవ్ర విమర్శలు చేశారు.
- ఈ వ్యాఖ్యాలను తప్పుపడుతూ గుజరాత్ కు చెందిన బీజేపీ MLA పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశాడు.
- దీనిపై విచారణ జరిపిన సూరత్ జిల్లా కోర్టు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ, రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విదిస్తూ తీర్పు చేప్పారు.
- "నిందితుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ప్రజల్లో ఆయన చేసే ప్రసంగాలకు ప్రభావం ఎక్కువ. నిందితుడికి స్వల్ప శిక్ష విధిస్తే అది ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తుంది. ఎవరు ఎవరిపైనైనా సులువుగా అపనింద వేస్తారు" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
రాహుల్ లోకసభ సభ్యత్వం రద్దు:
- సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పువల్ల ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3) మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1)(ఇ) ప్రకారం రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు (అనర్హత) చేస్తూ లోకసభ సెక్రటేరియెట్ 25 మార్చ్ 2023 న నోటిఫికేషన్ జారిచేసింది. ఈ అనర్హత తీర్పు వెలువడిన రోజైనా 23 మార్చ్ 2023 నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టంచేసింది.
- ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం, ఏదైనా నేరంలో చట్ట సభ సభ్యుడికి రెండేళ్ళకు తక్కువ కాకుండా శిక్షపడితే.. ఆ తీర్పు వచ్చిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుంది. అలాగే జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు.
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1)(ఇ) ప్రకారం, పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం ఏ వ్యక్తి అయిన అనర్హుడైతే, ఆ వ్యక్తి భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం క్రింద లాభదాయకమైన పదవిలో కొనసాగడానికి వీలులేదు.
Gandhi’s 2019 speech that has got him in trouble. A court in Gujarat's Surat city, today convicted Rahul Gandhi in a criminal defamation case against him over his alleged "Modi surname" remark. He was sentenced to 2 years in jail by the court. pic.twitter.com/dIsXZsKGca
— Eagle Eye (@SortedEagle) March 23, 2023