Monday, March 20, 2023

About Oscar / Academy Awards in Telugu | ఆస్కార్ / అకాడమీ అవార్డులు

About Oscar / Academy Awards in Telugu | ఆస్కార్ / అకాడమీ అవార్డులు | Student Soula


ఆస్కార్ అవార్డులు (Oscar / Academy Awards):

  • ప్రపంచ అత్యున్నత సినీరంగ అవార్డు.
  • వీటిని అకాడమీ అవార్డులు అని కూడా అంటారు.
  • ప్రధానం చేయువారు  Academy of Motion Picture Arts and Sciences (AMPAS). దీనిని 11 మే 1927 న స్థాపించారు.
  • వేదిక  లాస్ ఏంజెల్స్‌లోని కొడాక్ థియేటర్ (డాల్బీ థియేటర్)
  • ప్రతియేటా చలన చిత్ర రంగంలో (24 కేటగిరీల్లో) అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి ఇస్తారు.
  • మొట్టమొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం  1929 మే 16
  • తొలి ఆస్కార్ విజేత  Emil Jannings (Best Actor)
  • తొలిసారి 1930లో రేడియోలో, 1953లో దూరదర్శన్‌లో ప్రసారం చేయబడింది.
  • అత్యధికంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు  Ben-Hur (1959), Titanic (1997), The Lord of the Rings: The Return of the King (2003).
  • అత్యధికంగా ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి  Walt Disney (22)
  • Official Website  www.oscars.org

ఆస్కార్ అవార్డులు - భారతదేశం:

RRR (2022):

  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హిరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
  • 95వ ఆస్కార్ అవార్డు (2023)లో Best Original Song విభాగంలో 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలుచుకుంది.
  • ఈ పాటను రచించిన చంద్రబోస్, సంగీతం అందించిన ఎం.ఎం.కీరవాణి ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.
  • ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి పూర్తిస్థాయి భారతీయ చిత్రంగా RRR చరిత్ర సృష్టించింది.

ది ఎలిఫెంట్ విస్పరర్స్ (2022):

  • అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కించిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం.
  • 95వ ఆస్కార్ అవార్డు (2023)లో Best Documentary Short Film విభాగంలో ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఆస్కార్ గెలుచుకుంది.
  • ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు.
  • కార్తికి గోన్సాల్వెస్ కి దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం.
  • భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ దక్కడం ఇదే మొదటిసారి.

విదేశీ చిత్రాలకు పనిచేసి ఆస్కార్ అందుకున్న భారతీయులు:

గాంధీ (1982): 

  • మహాత్మ గాంధీ జీవితం ఆధారంగా తీసిన ఇంగ్లండ్ చిత్రం. ఇది 55వ ఆస్కార్ అవార్డులో (1983) మొత్తం 8 అవార్డులను పొందింది.
  • Best Costume Desing  భాను అథియా. ఈమె ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి.

స్లమ్ డాగ్ మిలియనీర్ (2008):

  • ముంబైలోని ధారవి మురికి వాడలోని ఒక బాలుడి ఇతివృత్తంతో తీసిన ఇంగ్లండ్ చిత్రం. ఇది 81వ ఆస్కార్ అవార్డులో (2009) మొత్తం 8 అవార్డులను పొందింది 
  • Best Original Song  ‘జయహో’ పాటకుగాను Gulzar (Lyrics), A.R.Rahman (Music)
  • Best Original Score  A.R.Rahman
  • Best Sound Mixing ⇒ Rasul Pookutty 

స్మైల్ పింకి (2008) :

  • గ్రహణ మొర్రి (Cleft Lip) తో బాధపడుతున్న బాలల ఇతివృత్తంతో తీసిన అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ (ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింకీ నటించింది)
  • 81వ ఆస్కార్ అవార్డులో (2009) Best Documentary Short Film విభాగంలో ఆస్కార్ పొందింది.

ముఖ్యమైన అంశాలు:

  • ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి  భాను అథియా (1983లో)
  • సత్యజిత్ రే  జీవిత కాలంలో సినిమా రంగంలో విశేష కృషి చేసినందుకు 1992లో (64వ) Honorary Academy Award (ప్రత్యేక కేటగిరీ) అందుకున్నారు. ఈ అవార్డు పొందిన తొలి ఆసియావాసి, ఏకైక భారతీయుడు.
  • రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడు  ఎ.ఆర్.రెహామాన్ (2009లో) 
  • ఆస్కార్ అవార్డులలో నామినేటెడ్ అయిన తొలి భారతీయ చిత్రం  మదర్ ఇండియా. ఇది 30వ ఆస్కార్ అవార్డులో (1958) Best International Feature Film విభాగంలో నామినేటె అయింది.
  • Best Documentary Short Film విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం  ది ఎలిఫెంట్ విస్పరర్స్ (2023లో)
  • ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి పూర్తిస్థాయి భారతీయ చిత్రం  RRR (2023లో)


No comments:

Post a Comment