Home

World Day of Social Justice in Telugu | ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం - ఫిబ్రవరి 20 | Student Soula

World Day of Social Justice in Telugu | ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం - ఫిబ్రవరి 20 | Student Soula Tags: World Day of Social Justice in telugu, about World Day of Social Justice in telugu, World Day of Social Justice essay in telugu, prapamcha samajika nyaya dinotsavam, theme of World Day of Social Justice in telugu, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 20 in telugu, Student Soula,

WORLD DAY OF SOCIAL JUSTICE
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
****

ఉద్దేశ్యం:

  • సామాజిక న్యాయ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) జరుపుకుంటారు.

ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు?

  • 26 నవంబర్ 2007 న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 62వ సెషన్ లో ఫిబ్రవరి 20 వ తేదీని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.
  • 2009 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) ను జరుపుకుంటున్నారు.

థీమ్ (Theme): 

  • 2023: Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice.
  • 2022: Achieving Social Justice through Formal Employment

సామాజిక న్యాయం (Social Justice):

  • దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమన్యాయం జరగడం, దేశ వనరులు, సంపదపై ప్రజలందరికీ సమాన వాటాలు దక్కడమే సామాజిక న్యాయం (Social Justice).
  • సామాజిక న్యాయం సుసాధ్యం కావడానికి పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, నిరుద్యోగాన్ని నిలువరించడం, సామాజిక భద్రత, ఆర్థిక అసమానతల తొలగింపు, జనాభా నియంత్రణ, నిరక్షరాస్యత నిర్మూలన లాంటి ముఖ్యమైన అంశాలు దోహదపడుతాయి.
  • ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆర్థికంగా సమగ్రాభివృద్ధి చెందినప్పుడు మాత్రమే శాంతియుత సమాజం, సామాజిక న్యాయం వికసిస్తుంది.

రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ స్పూర్తిని అంతర్లీనం చేశారు. వాటిలో కొన్ని, 

  • ప్రవేశిక: ప్రజలందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని తెలుపుతోంది.
  • ఆర్టికల్ 38: ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి.
  • ఆర్టికల్ 38(1): ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వాలు పాటుపడాలి. రాజ్యం స్థాపించే సంస్థలు, వ్యవస్థ ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చే సాధనాలుగా ఉండాలి.
  • ఆర్టికల్ 17: సామాజికంగా అందరూ సమానం అని చెబుతూ, అంటరానితనాన్ని (Untouchability) నిషేధించింది.
  • ఆర్టికల్ 325: మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు.


వీటిని కూడా చూడండీ: