History of International Civil Aviation Day in Telugu | అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం |
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం- డిసెంబర్ 7
ఉద్దేశ్యం:
- సామాజిక, ఆర్ధికాభివృద్ధిలో అంతర్జాతీయ వైమానిక విభాగానికిగల ప్రపంచ ప్రాముఖ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అంతర్జాతీయ విమాన రవాణా క్రమబద్దీకరణ, రక్షణ, సామర్ధ్యం పెంపుదలలో ICAO పాత్ర గురించి తెలియజెప్పడము అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (International Civil Aviation Day) ముఖ్య ఉద్దేశం.
చరిత్ర:
- చికాగో కన్వెన్షన్(Chicago Convention) ఒప్పందంపై 52 దేశాలు సంతకం చేసి 1994 డిసెంబర్ 7 నాటికి 50 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ICAO) ఈ రోజును జరుపుకుంది.
- కెనడా ప్రభుత్వం చొరవతో పాటు ICAO అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్య సమితి(UNO) 1996లో అధికారికంగా డిసెంబర్ 7ను అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది.
ICAO గురించి:
- అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO- International Civil Aviation Organization)
- ఇది 1947 ఏప్రిల్ 4 న ఏర్పాటైంది.
- దీని ప్రధాన కార్యాలయం కెనడా (Canada)లో ఉంది.
- ICAO కన్నా ముందు International Commission for Air Navigation (ICAN) ఉండేది. దీని యొక్క మొదటి కన్వెన్షన్ 1903లో జర్మని దేశ రాజదాని బెర్లిన్(Berlin)లో జరిగింది. దీనికి 08 దేశాలు హాజరయ్యాయి. కానీ హాజరైన ఎనిమిది దేశాలలో ఎటువంటి ఒప్పందాలు కుదరలేదు.
- 1906లో బెర్లిన్‌లో జరిగిన రెండవ సదస్సులో 27 దేశాలు హాజరయ్యాయి.
- 1912లో లండన్‌లో జరిగిన మూడవ సదస్సులో విమానాల ఉపయోగం కోసం మొదటి రేడియో కాల్‌సైన్(Radio Callsigns) లను కేటాయించింది.
- 1944 డిసెంబర్ 7 న చికాగోలో జరిగిన సదస్సులో చికాగో కన్వెన్షన్ (Chicago Convention) ఒప్పందంపై 52 దేశాలు సంతకం చేశాయి.
- దాని నిబంధనల ప్రకారం తాత్కాలిక అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థను(PICAO- Provisional International Civil Aviation Organization) ఏర్పాటు చేయవలసి ఉంది.
- 26 దేశాలు ఈ సమావేశాన్ని ఆమోదించినప్పుడు శాశ్వత సంస్థ ఏర్పడుతుంది. దీని ప్రకారం 1945 జూన్ 6 న ICAN స్థానంలో PICAO పనిచేయడం ప్రారంభించింది.
- 26వ దేశం 1947 మార్చి 5 న సదస్సును ఆమోదించింది. దీని ఫలితంగా PICAO స్థానంలో 1947 ఏప్రిల్ 4 న ICAO శాశ్వత సంస్థగా స్థాపించబడింది.
- వైమానిక భద్రత విషయంలో ICAO నాయకత్వ పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా వైమానిక భద్రతను పెంపొందించడం ఈ సంస్థ పూర్తి స్థాయి లక్ష్యం.
Theme (థీమ్):
- 2020 - 2023: Advancing Innovation for Global Aviation Development (ప్రపంచ పౌరవిమానయాన రంగ అభివృద్ధికి సరికొత్త నవకల్పనను జోడించడం)
- 2019: 75 Years of Connecting the World
- 2015 - 2018: ఏ దేశమూ వెనుకబడి లేదని నిర్ధారించడానికి కలిసి పనిచేయడం. (Working Together to Ensure No Country is Left Behind)
- 2014: గ్లోబల్ ఏవియేషన్ పురోగతిపై సహకరించడం: చికాగో కన్వెన్షన్ జరిగి 70 సంవత్సరాలు (Cooperating on Global Aviation Progress: 70 Years of the Chicago Convention)
- 2013: Evolving to Meet the Challenges of 21st Century Air Transport.
వీటిని కూడా చూడండీ: