History of World Telecommunication and Information Society Day in Telugu | ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం |
ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు
ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం - మే 17
ఉద్దేశ్యం:
సుదూర ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేలా కమ్యూనికేషన్ ని వ్యాప్తి చేయడం, మన జీవితంలో కమ్యూనికేషన్ ఎంత కీలకమైనదో అవగాహన పెంచడం, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం (World Telecommunication and Information Society Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1969 నుంచి ప్రతి సంవత్సరం మే 17 వ తేదీన ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మే 17 నే ఎందుకు?
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU- International Telecommunication Union) 17 మే 1865 న స్థాపించబడింది.
దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 17 వ తేదీన ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవమును జరుపుకుంటారు.
చరిత్ర:
ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం:
అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) 17 మే 1865 న స్థాపించబడింది. దీని జ్ఞాపకార్థం 1969 నుంచి ప్రతి సంవత్సరం మే 17 వ తేదీన ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం (World Telecommunication Day) ను జరుపుకుంటున్నారు.
దీనిని 1973 లో మాలాగా-టోర్రెమోలినోస్ లో జరిగిన ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్ ప్రారంభించింది.ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం:
నవంబర్ 2005 లో జరిగిన ఇన్ఫర్మేషన్ సొసైటీపై ప్రపంచ సదస్సు (World Summit on the Information Society) ఇన్ఫర్మేషన్ సొసైటీకి సంబంధించిన విస్తృత సమస్యలపై దృష్టి సారించడానికి మే 17 ను ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం (Information Society Day) గా ప్రకటించాలని UN జనరల్ అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్దేశించిన తీర్మానాన్ని మార్చి 2006 లో UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది.ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం:
నవంబర్ 2006 లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ITU ప్లీనిపోటెన్షియరీ కాన్ఫరెన్స్, మే 17 న ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం (World Telecommunication and Information Society Day) ను జరుపుకోవాలని నిర్ణయించింది.
థీమ్ (Theme):
- 2020: Connect 2030: ICTs for the Sustainable Development Goals (SDGs)
- 2019: Bridging the standardization gap
- 2018: Enabling the positive use of Artificial Intelligence for All
- 2017: Big Data for Big Impact
- 2016: ICT entrepreneurship for social impact
ITU:
- స్థాపన: 17 మే 1865
- ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్ లోని జెనీవా
- 1865 లో ప్యారిస్ లో జరిగిన మొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ సమావేశం ద్వారా స్థాపించబడిన అంతర్జాతీయ టెలిగ్రాఫ్ యూనియన్ (International Telegraph Union) మరియు 1906 లో బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ రేడియోటెలెగ్రాఫ్ సదస్సులో స్థాపించబడిన అంతర్జాతీయ రేడియోటెలెగ్రాఫ్ యూనియన్ (International Radiotelegraph Union) 1932 లో జరిగిన మాడ్రిడ్ సమావేశంలో విలీనం అయ్యి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU- International Telecommunication Union) గా మారింది. ఇది 1947 నుండి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది.
- రేడియో స్పెక్ట్రం యొక్క ప్రపంచ వినియోగాన్ని ITU సమన్వయం చేస్తుంది, ఉపగ్రహ కక్ష్యలను కేటాయించడంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది మరియు ప్రపంచవ్యాప్త సాంకేతిక ప్రమాణాల అభివృద్ధి మరియు సమన్వయానికి సహాయపడుతుంది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, తాజా తరం వైర్ లెస్ టెక్నాలజీస్, ఏరోనాటికల్ మరియు మారిటైమ్ నావిగేషన్, రేడియో ఖగోళ శాస్త్రం, ఉపగ్రహ ఆధారిత వాతావరణ శాస్త్రం, స్థిర-మొబైల్ ఫోన్‌లో కన్వర్జెన్స్, ఇంటర్నెట్ యాక్సెస్, డేటా, వాయిస్, టివి ప్రసారం మరియు తదుపరి రంగాలలో కూడా ITU చురుకుగా ఉంది.
- ITU Official Website- www.itu.int
టెలికమ్యూనికేషన్:
- వైర్, రేడియో, ఆప్టికల్ లేదా ఇతర విద్యుదయస్కాంత వ్యవస్థల ద్వారా సంకేతాలు, సందేశాలు, పదాలు, రచనలు, చిత్రాలు మరియు శబ్దాలు లేదా ఏదైనా ప్రకృతి సమాచారం మార్పిడి చేసినప్పుడు టెలికమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అంటే సమాచారాలను చేరవేయు సంకేతాల ప్రసారాలను టెలికమ్యూనికేషన్ (Telecommunication) అంటారు.
- టెలికమ్యూనికేషన్ అనే పదం గ్రీకు prefix tele (τηλε) యొక్క సమ్మేళనం. దీని అర్థం దూరం. లాటిన్ లో కమ్యూనికేషన్ అంటే పంచుకోవడం.
వీటిని కూడా చూడండీ: