History of World Press Freedom Day in Telugu | ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం |
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా
దినోత్సవం - మే 03
ఉద్దేశ్యం:
పత్రికా స్వేఛ్చ, విలువల పట్ల అవగాహనా కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేఛ్చ స్థితిగతులను పర్యవేక్షించడం, స్వేచ్ఛ కలిగిన మీడియాను దాడుల నుంచి రక్షించడం, నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి అర్పించడం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం (World Press Freedom Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1994 నుంచి ప్రతి సంవత్సరం మే 03 వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
మే 03 నే ఎందుకు?
ఆఫ్రికన్ జర్నలిస్టులు 03 మే 1991 న విండ్ హోక్ డిక్లరేషన్ (Windhoek Declaration) ను ప్రకటించారు.
దీని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 03 వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
చరిత్ర:
- 1991లో ఆఫ్రికన్ జర్నలిస్టులు ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు నమీబియా రాజధాని విండ్ హోక్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛపై ఒక కీలక ప్రకటన చేశారు. దీనినే విండ్ హోక్ డిక్లరేషన్ (Windhoek Declaration) అంటారు.
- ఈ డిక్లరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ప్రకటనల శ్రేణిలో మొదటిది మరియు పత్రికా స్వేచ్ఛపై అంతర్జాతీయ సమాజం యొక్క నిబద్ధతకు కీలకమైన ధృవీకరణగా ఈ పత్రం విస్తృతంగా ప్రభావితమైంది.
- 1991 లో జరిగిన యునెస్కో సర్వసభ్య సమావేశం (26వ సెషన్) లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితికి సిఫారసు చేసింది.
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1993 డిసెంబర్ లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రకటించింది.
- 1994 నుంచి ప్రతి సంవత్సరం మే 03 వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
గుల్లెర్మో కేనో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం అవార్డు:
- ప్రపంచంలో ఎక్కడైనా ప్రమాదపు టంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి లేదా ప్రోత్సహించడానికి విశేష కృషి చేసిన వ్యక్తి (జర్నలిస్టు) లేదా సంస్థకు 1997 నుంచి ప్రతి సంవత్సరం యునెస్కో/గుల్లెర్మో కేనో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం అవార్డు (UNESCO/Guillermo Cano World Press Freedom Prize) ను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు కింద 25,000 డాలర్లను బహుకరిస్తారు.
- గుల్లెర్మో కేనో ఇసాజ (Guillermo Cano Isaza) (1925-1986) అనే వ్యక్తి కొలంబియాలోని ఓ పత్రికకు ఎడిటర్ గా పనిచేసేవాడు. అతని రాతల వల్ల డ్రగ్ మాఫియా అతనిపై కక్ష గట్టి 1986 డిసెంబర్ 17 న కొలంబియా దేశపు బొగోటాలోని అతని వార్తాపత్రిక ఎల్ ఎస్పెక్టడార్ (El Espectador) కార్యాలయం ముందు దారుణంగా హత్య చేసింది. ఆయన బలిదానం పత్రికా స్వేచ్ఛకు స్ఫూర్తిగా నిలవడంతో ఆయన పేరు మీద ఈ అవార్డును అందజేస్తున్నారు.
- మొదటి అవార్డు గ్రహీత: Gao Yu (చైనా)
- 2020 అవార్డు గ్రహీత: Jineth Bedoya Lima (కొలంబియా)
థీమ్ (Theme):
- 2020: Journalism without Fear or Favour
- 2019: Media for Democracy: Journalism and Elections In Times of Disinformation
- 2018: Keeping Power in Check: Media, Justice and the Rule of Law
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI):
- పత్రికా స్వేచ్ఛను కాపాడటం, భారతదేశంలో పత్రికా ప్రమాణాలను నిర్వహించడం మరియు మెరుగుపరచడం అనే ఉద్దేశ్యంతో మొదటి ప్రెస్ కమిషన్ సిఫారసులపై 1966 లో పార్లమెంటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI- Press Council of India) ను మొదటిసారి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది ప్రెస్ కౌన్సిల్ చట్టం-1978 ప్రకారం పనిచేస్తుంది.
- PCI Official Website- presscouncil.nic.in
ముఖ్యమైన అంశాలు:
- భారతదేశంలో వెలువడిన మొదటి పత్రిక- బెంగాల్ గెజిట్. ఈ పత్రిక సంపాదకుడు జేమ్స్ హిక్కి. ఇది 1780 జనవరి 27 న కలకత్తాలో వెలువడింది.
- ప్రస్తుతం ప్రచురింపబడుతున్న వార్తా పత్రికల్లో పురాతన వార్తా పత్రిక- బాంబే సమాచార్. బొంబాయిలో 1822 లో ప్రారంభించిన దీనిని ప్రస్తుతం ముంబాయి సమాచార్ గా పిలుస్తున్నారు. గుజరాతీ, ఇంగ్లీష్ భాషలో వెలువడే ఈ ముంబై సమాచార్ ఆసియాలోనే అత్యంత ప్రాచీన దినపత్రికగా చరిత్ర సృష్టించింది.
- భారత్ లో అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక (2011 నాటికి)- ద టైమ్స్ ఆఫ్ ఇండియా
- అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు దిన పత్రిక- ఈనాడు
- భారతదేశంలో మొదటి భారతీయ భాషాపత్రిక- దిగ్దర్శన్ (1818)
- భారతీయులు స్థాపించి, భారతీయులే నిర్వహించి, భారతీయుల సంపాదకత్వంలో వెలువడిన మొదటి పత్రిక- సంవాద కౌముది (కోల్‌కతా నుండి రామ్ మోహన్ రాయ్ ప్రచురించిన బెంగాలీ వారపత్రిక)
మరికొన్ని అంశాలు:
ప్రజాస్వామ్య దేశాలల్లో పత్రికలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా నిలుస్తాయి. కానీ నేడు పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మీడియాపై నియంత్రణకు ప్రభుత్వాలు, ఉగ్రవాద సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. మీడియాపై దాడులకు తెగిస్తున్నాయి. పత్రికల గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
వీటిని కూడా చూడండీ: