History of International Day of Education in Telugu | అంతర్జాతీయ విద్యా దినోత్సవం - జనవరి 24 |
INTERNATIONAL DAY OF EDUCATION
అంతర్జాతీయ విద్యా దినోత్సవం
లక్ష్యం:
- సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం మరియు శాంతి, అభివృద్ధిలో విద్య యొక్క పాత్రను తెలియజేయడం అంతర్జాతీయ విద్యా దినోత్సవం (International Day of Education) ముఖ్య లక్ష్యం.
ఎప్పటి నుంచి?
- 3 డిసెంబర్ 2018 న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జనవరి 24 ను అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించే తీర్మానాన్ని ఆమోదించింది.
- 2019 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 24 వ తేదీన అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
థీమ్ (Theme):
- 2020: Learning For People, Planet, Prosperity, And Peace
- 2021: Recover and Revitalize Education for the COVID-19 Generation
- 2022: Changing Course, Transforming Education
- 2023: to invest in people, prioritise education
మరికొన్ని అంశాలు:
- మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (Universal Declaration of Human Rights) యొక్క ఆర్టికల్ 26 లో విద్యా హక్కు పొందుపరచబడింది.
- భారత రాజ్యాంగంలోని, ఆర్టికల్-45: బాలలకు ఉచిత నిర్బంధ విద్య
- భారత రాజ్యాంగంలోని, ఆర్టికల్-21(A): ప్రాథమిక నిర్బంధ విద్యా హక్కు
వీటిని కూడా చూడండీ:
- జాతీయ విద్యా దినోత్సవం (National Education Day) - నవంబర్ 11
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)