History of International Children's Book Day in Telugu | అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం |
అంతర్జాతీయ బాలల
పుస్తక దినోత్సవం - ఏప్రిల్ 2
ఉద్దేశ్యం:
పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పెంపొందించడం, పిల్లలతో బాటు పెద్దల్ని కూడా బాల సాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం (International Children's Book Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1967 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2 వ తేదీన అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 2 నే ఎందుకు?
డెన్మార్క్ దేశానికి చెందిన ప్రఖ్యాత బాల సాహిత్య రచయిత హాన్స్ క్రిస్టియన్ ఆండర్‌సన్ (Hans Christian Andersen) 2 ఏప్రిల్ 1805 న జన్మించాడు.
ఈయన గౌరవార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 2 ను అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవంగా ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ (IBBY- International Board on Books for Young People) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తోంది.
హాన్స్ క్రిస్టియన్ ఆండర్‌సన్ |
IBBY:
- స్థాపన: 1953
- ప్రధాన కార్యాలయం: స్విట్జర్లాండ్ లోని బాసెల్
- Official Website: https://www.ibby.org/
- IBBY (International Board on Books for Young People) అనేది లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ.
- ఈ సంస్థ బాల సాహిత్య రచయితలను, బాల సాహిత్యాన్ని, బాలల్ని అంతర్జాలం ద్వారా కలపడానికి వారథిలా కృషి చేస్తున్నది.
- UNESCO మరియు UNICEF లో అధికారిక హోదా కలిగిన ప్రభుత్వేతర సంస్థగా, పిల్లల పుస్తకాలకు న్యాయవాదిగా IBBY విధాన రూపకల్పన పాత్రను కలిగి ఉంది.
- 1990 లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన పిల్లల హక్కులపై అంతర్జాతీయ సదస్సు (International Convention on the Rights of the Child) యొక్క సూత్రాలకు IBBY కట్టుబడి ఉంది.
హన్స్ క్రిస్టియన్ అండర్సన్ అవార్డు:
- పిల్లల సాహిత్య రంగంలో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు హన్స్ క్రిస్టియన్ అండర్సన్ అవార్డు (Hans Christian Andersen Award)
- 1956 నుంచి పిల్లల పుస్తకాల రచయితలకు (Author's Award) మరియు 1966 నుంచి చిత్రకారులకు (Illustrator's Award) ఈ అవార్డును IBBY సంస్థ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంది.
హన్స్ క్రిస్టియన్ అండర్సన్ అవార్డు |
మరికొన్ని అంశాలు:
- Antoine de Saint-Exupéry రాసిన ది లిటిల్ ప్రిన్స్ (The Little Prince) అనే ఫ్రెంచ్ నవల ప్రపంచ వ్యాప్తంగా 361 భాషల్లోకి అనువదించబడింది. మొత్తం 14 కోట్ల కాపీలు (140 Million Copies) అమ్ముడైంది. ఈ నవల ఇప్పటి వరకు ప్రచురించబడిన నవలలల్లో అత్యధికంగా అనువదించబడిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
- బ్రిటీష్ రచయిత్రి జె.కె. రౌలింగ్ రాసిన హారీపోటర్ (Harry Potter) నవల 7 భాగాలు కలిసి 50 కోట్లకుపైగా (2018 నాటికి) కాపీలు అమ్ముడయ్యాయి. చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఇదే.
వీటిని కూడా చూడండీ:
- ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం (World Book and Copyright Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)