History of World Hemophilia Day in Telugu | ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం |
ప్రపంచ హిమోఫిలియా
దినోత్సవం - ఏప్రిల్ 17
ఉద్దేశ్యం:
హిమోఫిలియా వ్యాధి మరియు ఇతర రక్తస్రావ లోపాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం (World Hemophilia Day) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
1989 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17 వ తేదీన ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఏప్రిల్ 17 నే ఎందుకు?
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా (WFH- World Federation of Hemophilia) ను స్థాపించిన ఫ్రాంక్ ష్నాబెల్ (Frank Schnabel) ఏప్రిల్ 17 న జన్మించాడు.
ఈయన జ్ఞాపకార్థం ఈయన పుట్టినరోజైన ఏప్రిల్ 17 ను ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా WFH ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
థీమ్ (Theme):
- 2020: Get + Involved
- 2019: Outreach and Identification
- 2018: జ్ఞానాన్ని పంచుకోవడం మమ్మల్ని బలోపేతం చేస్తుంది (Sharing Knowledge Makes Us Stronger)
- 2017: వారి గొంతులను వినండి (Hear Their Voices)
WFH:
- స్థాపన: 1963
- స్థాపించింది: ఫ్రాంక్ ష్నాబెల్ (Frank Schnabel)
- ప్రధాన కార్యాలయం: మాంట్రియల్, కెనడా
- WFH Official Website: http://www.wfh.org/
- World Hemophilia Day Website: https://www.worldhemophiliaday.org
- వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫిలియా (WFH- World Federation of Hemophilia) అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ.
- మెరుగైన రోగ నిర్ధారణ మరియు చికిత్స లేకుండా ఉన్నవారి సంరక్షణకు ప్రాప్యత కోసం ప్రయత్నం, ఈ వ్యాధితో బాధపడుతున్న మరియు చికిత్స పొందలేని ప్రజల కోసం నిధులను సేకరించడం WFH లక్ష్యం.
- మనిషికి గాయం అయినప్పుడు రక్తం కారుతుంది. అయితే, కొంతసేపటి తరువాత రక్తం గడ్డకట్టుతుంది. రక్తం గడ్డకట్టకుండా, రక్తం కారడాన్ని హిమోఫిలియా (Hemophilia or Haemophilia) అంటారు.
- హిమోఫిలియాను ప్రధానంగా A, B అని రెండు రకాలుగా విభజించుకోవచ్చు. హిమోఫిలియా A రకంలో ఫ్యాక్టర్ 8 లోపం, B రకంలో ఫ్యాక్టర్ 9 లోపం కనబడుతుంది. దాదాపు 90% మందిలో A రకమే కనబడుతుంది. మరో 9 శాతం మందిలో B రకం, మిగతా ఒక శాతం మందిలో ఫ్యాక్టర్ 11, 5 లోపం వంటి ఇతరత్రా రకాల హిమోఫిలియా కనబడుతుంది.
- 70 శాతం వంశపారంపర్యంగానూ, 30 శాతం ఆకస్మిక జన్యు మార్పిడి కారణంగా, పుట్టుకతో వచ్చే ఈ వ్యాధి వలన వ్యాధిగ్రస్తులు ఏటా పెరుగుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
- ఎక్కువ శాతం మగపిల్లలోనే ఈ వ్యాధి ఉంటుంది. ప్రతి పది వేల మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది.
వ్యాది లక్షణాలు:
- రక్తం గడ్డకట్టకపోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
- శరీరంలో గాయాలు అయినప్పుడు, ఏదైనా శస్త్ర చికిత్స జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినపుడు రక్తం గడ్డకట్టకుండా నిరంతరంగా రక్తం స్రవించడం, గాయాలు మానకపోవడం, ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్లు, మల, మూత్రం ద్వారా రక్తం స్రవించడం
- సమస్య తీవ్రంగా ఉన్నవారిలో ఇంజెక్షన్ తీసుకున్న చోట పెద్దగా ఉబ్బటం, అక్కడక్కడా చర్మం నల్లగా కమిలినట్టు కనిపించటం వంటివీ వేధిస్తుంటాయి.
- కొందరికి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒంట్లోనూ రక్తస్రావం కావొచ్చు. ఇలా కండరాల్లోకి, కీళ్లలోకి రక్తస్రావం కావటం వల్ల తీవ్రమైన నొప్పి, వాపుతో పిల్లలు విలవిల్లాడిపోతారు.
- తరచుగా రక్తస్రావమైతే కీళ్లు పెద్దగా ఉబ్బి, ఆకారం మారిపోవచ్చు. ఈ అవకరం శాశ్వతంగానూ ఉండిపోతుంది. కాబట్టి దీనిపై అవగాహన కలిగి ఉండటం అవసరం.
- గాయం నుంచి స్రవిస్తున్న రక్తం ఎంతకీ గడ్డకట్టకపోతే, ఐసు గడ్డను గాయంపై పూసి, తక్షణమే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
రక్తం గడ్డకట్టడం:
- రక్తంలో ప్లాస్మా 55% ఉంటుంది. ప్లాస్మా లోని ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్లు రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో పాత్ర వహిస్తాయి.
- రక్త ఫలకికలు (Blood Platelets) ముఖ్యవిధి రక్తాన్ని గడ్డ కట్టించడం (రక్త స్కంధనం). కాబట్టి వీటిని థ్రాంబోసైట్స్ అని కూడా అంటారు.
- గాయమైన ప్రాంతంలో గల రక్తఫలకికలు విచ్చిన్నం చెంది థ్రాంబోప్లాస్టిన్లను విడుదల చేస్తాయి. థ్రాంబోప్లాస్టిన్ రక్తంలోని ప్రోథ్రాంబిన్ ను థ్రాంబిన్ గా మారుస్తుంది. ఇలా థ్రాంబిన్ వెంటనే రక్తంలోని ఫెబ్రినోజన్ ను ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ పోచలు ఒకదానికొకటి అల్లుకొని సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చి రక్తం గడ్డకట్టి రక్తస్రావంను అరికడుతుంది.
- సగటున రక్తం గడ్డకట్టుటకు తీసుకునే సమయం 2 నుంచి 6 నిమిషాలు
- రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు- థ్రాంబోసైట్స్
- రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు- పైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్
- రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం- కాల్షియం
- రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్- విటమిన్ K
- రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని త్రాంబస్ అంటారు. ఇది ప్రమాదకరమైనది
- రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే కారకం/దోహదపడే కారకం- హెపారిన్
- బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వచేసే కాలం 3-4 నెలలు. రక్తం గడ్డకట్టకుండా నివారించుటకు బ్లడ్ బ్యాంక్ లో ఉపయోగించే రసాయనాలు- సోడియం, కాల్షియం, అల్యూమినియంల సిట్రేట్ లు, ఆక్సలేట్ లు, కృత్రిమ హెపారిన్.
వీటిని కూడా చూడండీ:
- జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం (National Voluntary Blood Donation Day)
- ప్రపంచ రక్త దాతల దినోత్సవం (World Blood Donor Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)