INTERNATIONAL WOMEN'S DAYఅంతర్జాతీయ మహిళా దినోత్సవం****
ఉద్దేశ్యం:
- స్త్రీలను పురుషులతో సమానంగా అన్ని రంగాలలో ప్రోత్సాహించడం మరియు వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD - International Women's Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
- మహిళలంతా జెండర్ ఈక్వాలిటీ ప్రచారమే మహిళా దినోత్సవం లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోంది.
ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు?
- 1975లో ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.
- 1977లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 08వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) గా ప్రకటించింది.
మార్చి 8 నే ఎందుకు?
- మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే 1917లో రష్యా మహిళలు ఆహారం-శాంతి (Bread and Peace) అన్న నినాదాలతో పాటు తమకూ ఓటు హక్కు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ నాలుగు రోజుల పాటు సమ్మె చేశారు. దానికి ఎంత మద్దతు వచ్చిందంటే, ఆ దెబ్బకు అప్పటి రష్యా చక్రవర్తి గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, మహిళల డిమాండ్లను నెరవేరుస్తూ ఓటు హక్కును కల్పించింది. ఈ సమ్మె ప్రారంభించిన రోజు అప్పటి రష్యా జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23. అంటే మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8. ఈ విజయానికి గుర్తుగా మార్చి 08వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD - International Women's Day) ను జరుపుకుంటున్నారు.
IWD చరిత్ర:
- 1908: అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బట్టల మిల్లుల్లో వేల సంఖ్యలో మహిళా కార్మికులు పనిచేసేవాళ్లు. వారికోసం పనిచేసేచోట కనీస సౌకర్యాలు, నిర్దిష్టమైన పనిగంటలూ లేవు, పైగా వేతనాల్లో విపరీతమైన వ్యత్యాసం. 15 వేల మందికి పైగా మహిళలు తక్కువ పనిగంటలు, సరైన వేతనాలతో పాటు తమకూ ఓటు హక్కు కల్పించాలంటు రోడ్డెక్కారు. ఆ మార్చ్ కు అప్పట్లో మంచి స్పందన వచ్చింది.
- 1909: ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికా సోషలిస్టు పార్టీ ఫిబ్రవరి 28 ను జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.
- 1910: ఆగస్ట్ లో కోపెన్‌హాగన్‌లో రెండవ అంతర్జాతీయ మహిళా ఉద్యోగినుల సమావేశం (Second International Conference of Working Women) జరిగింది. ఈ సదస్సుకు 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. జర్మనీకి చెందిన అప్పటి మహిళా హక్కుల ఉద్యమకారిణి క్లారా జెట్కిన్ (Clara Zetkin) మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలన్న తన ఆలోచనను అక్కడ ప్రతిపాదించారు.
- 1911: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు. స్త్రీలకు చట్టసభల్లో చోటు, ఉద్యోగాల్లో వివక్షను నిర్మూలించడం, అన్ని రంగాల్లో సమానావకాశాలతో పాటు ఓటు హక్కు కల్పించాలంటూ నినదించారు.
- 1914: మన దేశంలో అనసూయా సారాభాయ్ నేతృత్వంలో మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్ లో ఈమె టెక్స్‌టైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది. అయితే, ఈ ఉద్యమాలకు బలమైన పునాది పడింది మాత్రం రష్యాలోనే.
- 1917: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, అంటే 1917 లో రష్యా మహిళలు ఆహారం-శాంతి (Bread and Peace) అన్న నినాదాలతో పాటు తమకూ ఓటు హక్కు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ నాలుగు రోజుల పాటు సమ్మె చేశారు. దానికి ఎంత మద్దతు వచ్చిందంటే, ఆ దెబ్బకు అప్పటి రష్యా చక్రవర్తి గద్దె దిగాల్సి వచ్చింది. తర్వాత ఏర్పడిన ప్రభుత్వం, మహిళల డిమాండ్లను నెరవేరుస్తూ ఓటు హక్కును కల్పించింది. ఈ సమ్మె ప్రారంభించిన రోజు అప్పటి రష్యా జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23. అంటే మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8.
- 1975: ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది.
- 1977: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 08వ తేదీని అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) గా ప్రకటించింది.
థీమ్ (Theme):
- 2023: DigitALL: Innovation and technology for gender equality
- 2022: Gender equality today for a sustainable tomorrow
- 2021: Women in leadership: Achieving an equal future in a COVID-19 world
- 1996: Celebrating the Past, Planning for the Future
మరికొన్ని అంశాలు:
- ఐక్యరాజ్య సమితి 1975 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరం (International Women's Year) గా ప్రకటించింది.
- మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం న్యూజిలాండ్ (1893). ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఆలస్యంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం సౌదీ అరేబియా (2015).
- Women and Men in India - 2022 Report
- భారతదేశంలో మొదటి మహిళల జాబితా (List of First Women in India)
- Women's Quotes In Telugu
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)