యునిసెఫ్ డే - డిసెంబర్ 11
- ఇది UNO అనుబంధ సంస్థ. ఇది 1946లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది.
- మొదట్లో ఇది తాత్కాలికమైన ఎమర్జెన్సీ సంస్థగానే ఉండేది. 1947 నుంచి 1950 వరకు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దెబ్బతిన్న పిల్లలకు సహాయం అందించడమే తన ధ్యేయంగా పనిచేసింది.
- 1953లో సుధీర్ఘ చర్చల అనంతరం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ UNICEF శాశ్వత మనుగడకు ఓటువేసింది. మొదట్లో ఉన్న United Nations International Children's Emergency Fund అన్న దాని పేరును United Nations Children's Fund గా మార్చారు. కాని UNICEF అన్నది అలా నిలిచిపోయింది.
లక్ష్యం:
- జాతి, మత,రాజకీయ వివక్షలేవి లేకుండా అవసరాలే ఆధారముగా పిల్లలకు సహాయపడడం.
- పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, పిల్లలకు టీకా మందులు, పోషకాహార అవసరాన్ని తెలియజెపుతూ, బాలలు తమ బాల్యాన్ని ఆనందంతో గడుపుతూ ఎదిగేలా చేయడమనేది UNICEF లక్ష్యం.
డిసెంబర్ 11నే ఎందుకు?
- UNICEF ను 1946 డిసెంబర్ 11న స్థాపించారు. దీనికి గుర్తుగా ప్రతీ సంవత్సరం UNICEF Day (యునిసెఫ్ దినోత్సవం) ను జరుపుకుంటారు.
అవార్డులు (Awards):
- UNICEF సేవలకు గాను 1965లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
- 1989లో ఇందిరా గాంధీ శాంతి బహుమతి (Indira Gandhi Peace Prize) లభించింది.
- 2006లో ప్రిన్స్ ఆఫ్ అస్టురియాస్ అవార్డు(Prince of Asturias Award) లభించింది. (Concord విభాగంలో)
UNICEF విధులు:
- యుద్ధంతో సహా సునామీ, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు యునిసెఫ్ సహాయ సహకారాలు అందిస్తుంది. పిల్లలకు అవసరమైన రక్షణ కలుగజేస్తుంది. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఉన్నతమైన చదువు అందేలా చూస్తుంది. అనారోగ్యము, మరణాలు, వ్యాధుల బారినపడే పిల్లల సంఖ్య తగ్గించడంలో తోడ్పడుతుంది. ఏ దేశములో ఏ విధముగా పనిచేయాలనేది ఆయా దేశాలకు సంభందించిన సమాచారము అనుసరించి పనిచేస్తుంది.
వీటిని కూడా చూడండీ: