History of World Soil Day in Telugu | ప్రపంచ నేల దినోత్సవం



History of World Soil Day in Telugu | ప్రపంచ నేల దినోత్సవం

ప్రపంచ నేల
దినోత్సవం - డిసెంబర్ 05

ఉద్దేశ్యం:

  • ఆహారభద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు మరియు మానవ శ్రేయస్సు కోసం నేల నాణ్యత యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ప్రపంచ నేల/మట్టి దినోత్సవం (World Soil Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

చరిత్ర:
  • 2002లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ (IUSS-International Union of Soil Sciences) ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవాన్ని (World Soil Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 5 న జరుపుకోవాలని సిఫారసు చేసింది.
  • 2012లో  థాయిలాండ్ దేశం నాయకత్వంలో మరియు Global Soil Partnership యొక్క చట్రంలో, ప్రపంచ అవగాహన పెంచే వేదికగా అధికారికంగా మట్టి (లేదా) నేల దినోత్సవాన్ని ఏర్పాటుచేయడానికి FAO మద్దతు ఇచ్చింది.
  • FAO యొక్క సమావేశం 2013 జూన్ లో ప్రపంచ నేల దినోత్సవాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది మరియు 68 వ UN సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించాలని అభ్యర్థించింది.
  • 2013 డిసెంబర్‌లో 68వ సర్వసభ్య సమావేశంలో UN జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 5 ను ప్రపంచ నేల దినంగా ప్రకటించింది. 
  • మొదటి ప్రపంచ నేల దినోత్సవాన్ని 2014 డిసెంబర్ 5 న జరుపుకున్నారు.

డిసెంబర్ 5 నే ఎందుకు?
  • ఈ దినోత్సవం ఏర్పాటుకు ప్రధాన ప్రతిపాదకులలో ఒకరైన  థాయిలాండ్ 09వ రాజు King Bhumibol Adulyadej (జ:5 December 1927 - మ:13 October 2016) జన్మ దినం సంధర్భంగా ఆయనకు గుర్తుగా డిసెంబర్ 5ను ప్రపంచ మట్టి (లేదా) నేల దినోత్సవంగా జరుపుకుంటారు.
World Soil Day in telugu, World Soil day essay in telugu, History of World Soil Day, about World Soil Day, Themes of World Soil Day, Celebrations of World Soil Day, World Soil Day, prapancha nela dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in December, days celebrations in December, popular days in December, December lo dinostavalu, special in December 5, Student Soula,
King Bhumibol Adulyadej 

థీమ్ (Theme):
  • 2020: నేలని సజీవంగా ఉంచండి, నేల జీవవైవిధ్యాన్ని రక్షించండి (Keep soil alive, Protect soil biodiversity)
  • 2019: నేల కోతను ఆపండి, మన భవిష్యత్తును కాపాడండి (Stop Soil Erosion, Save our Future)
  • 2018: నేల కాలుష్యానికి పరిష్కారం! (Be the Solution to Soil Pollution)
  • 2017: గ్రహం యొక్క సంరక్షణ గ్రౌండ్ నుండి మొదలవుతుంది (Caring for the Planet starts from the Ground)
  • 2016: నేలలు మరియు పప్పుధాన్యాలు జీవితానికి సహజీవనం (Soils and pulses, a symbiosis for life)
  • 2015: ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన నేలలు (Healthy soils for a healthy life)

నేల కాలుష్యం(Soil Pollution):
  • భూమి ఉపరితలాన్ని 71% సముద్రపు నీరు ఆవరించి ఉంది. కేవలం 29% మాత్రమే నేల ఆవరించి ఉంది.
  • నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాలలో నేల కాలుష్యం కూడా ముఖ్యమైనది.
  • పరిశ్రమలు రసాయన వ్యర్థాలను నేలపై విచక్షణ రహితంగా పారబోయడంవల్ల, వ్యవసాయ రంగంలో పురుగుమందులను ఎక్కువగా ఉపయోగించడంవల్ల, నేల విషతుల్యమౌతుంది. దీనివల్ల  నేల సారం దెబ్బతింటుంది.
  • అలాగే నీరు ఎక్కువ కాలంపాటు ఒకేచోట నిల్వ ఉండటం వల్ల నేల ఉప్పురికి సారాన్ని పోగొట్టుకుంది.
  • వరదలు, భారీ వర్షాలు నేల కోతకు కారణం అవుతున్నాయి. సారవంతమైన నేల పైపొర కొట్టుకు పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.

భారతదేశంలో నేలలు:
  • నేలల భౌతిక, రసాయనిక ధర్మాలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ (Pedology) అంటారు.
  • నేల మరియు మొక్కల మద్య ఉండే సంబంధాన్ని గురించి తెలిపేది - ఎడఫోలజి (Edaphology)
  • మృత్తికల సంబంధం లేకుండా మొక్కలు పెంచడాన్ని హైడ్రోఫోనిక్స్ (Hydroponics) అంటారు.
  • తటస్థ నేలల PH విలువ 6.5 నుంచి 7.5 వరకూ ఉంటుంది.
  • భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR - Indian Council of Agricultural Research) భారతదేశంలో నేలలను 08 రకాలుగా వర్గీకరించింది
(1)ఒండ్రు మట్టి నేలలు (Alluvial Soils):
  • ఇవి అత్యత సారవంతమైన నేలలు దేశ భూభాగంలో  సుమారు 24% విస్తరించి ఉన్నాయి.
  • ఆర్థికంగా అతి ప్రాధాన్యత గల నేలలు.
  • నదులు క్రమక్షయం చేసి తీసుకొని వచ్చే ఒండ్రు మట్టిని నిక్షేపించడం వల్ల ఒండ్రు నేలలు ఏర్పడుతాయి.
  • పాత ఒండ్రు మట్టి నేలలను భంగర్ అని, కొత్త ఒండ్రు  మట్టి నేలలను ఖాదర్ అని పిలుస్తారు.
  • ఒండ్రు నేలల్లో ప్రధానంగా పండు పంటలు - వరి, గోధుమ, చెరకు, జనుము మొదలైనవి.
(2)నల్లరేగడి నేలలు (Black Soils):
  • ఇవి ప్రధానంగా బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడ్డాయి. వీటినే రేగర్ నేలలు అని , తనను తాను దున్ను కొనే నేలలని అంటారు.
  • ఇవి వర్షాకాలంలో జిగటగా ఉండి, వేసవిలో ఎండి పోయి పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడతాయి.
  • పత్తి పంటకు ఇవి అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల వీటిని బ్లాక్ కాటన్ నేలలు అంటారు.
  • వీటికి నల్ల రంగు రావడానికి కారణం అదులో కరిగి ఉన్న ఇనుము మెగ్నీషియం ఆక్సైడ్స్ (టిటాని ఫెర్రస్ మెగ్నీషియం)
  • నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం అత్యధికంగా గల నేలలు.
(3)ఎర్ర నేలలు (Red Soils):
  • ప్రధానంగా గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందటం వల్ల ఇవి ఏర్పడ్డాయి.
  • ఇవి ఎర్రటి రంగులో ఉండటానికి కారణం ఈ నేలలో ఇనుప ధాతువు అధికంగా కరిగి ఉంటుంది.
  • మన దేశంలో అధికంగా ఉండే నేలలు. దేశ భూభాగంలో సుమారు 29% ఆక్రమించి ఉన్నాయి.
  • దేశంలో ఎక్కువ విస్తీర్ణంలో (సుమారు 67%) ఎర్ర నేలలు గల రాష్ట్రం - తమిళనాడు
  • నీరు త్వరగా ఇంకిపోయే గుణం కల్గి ఉంటాయి.
(4)లేటరైట్ నేలలు (Laterite Soils):
  • అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఇవి ఏర్పడ్డాయి.
  • లేటరైట్ అనే లాటిన్ పదానికి బ్రిక్ అనే అర్థం ఉంది.
  • ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినపుడు గట్టిగా ఉంటాయి. కనుక వీటిని Brick soil అంటారు.
  • పర్వత శిఖర భాగాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఏర్పడుతాయి.
  • ఈ నేలల్లో లభించే ముఖ్య ఖనిజం - బాక్సైట్.
  • కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, కొబ్బరి తోట లకు ఈ నేలలు శ్రేష్టమైనవి.
(5)శుష్క మరియు ఎడారి నేలలు (Arid and Desert 
     Soils):
  • ఈ నేలల్లో  ఫాస్పరస్ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
  • నీటిని నిల్వ చేసుకొనే సామర్ధ్యం అతి తక్కువ 
(6)లవణీయ నేలలు/క్షారమృత్తిక నేలలు (Saline 
     and Alkaline Soils):
  • ఇవి సారవంతమైనవి కావు. వీటిని రే /కల్లార్ /ఊసర నేలలు అని పిలుస్తారు.
(7)పర్వత, అటవీ నేలలు (Forest and Mountain 
     Soils):
  • దేశంలో పర్వత వాలుల వెంబడి విస్తరించి ఉన్నాయి. 
  • అడవులలోని ఆకులు , మొక్కలు నుండి తయారైన సేంద్రియ పదార్థాలతో ఈ నేలలు నిండి ఉంటాయి.
  • ఈ నేలలో హ్యూమస్ ఎక్కువ.
  • ఈ నేలల్లో కాఫీ, తేయాకు, ఉష్ణమండల ఫలాలు, సుగంధ ద్రవ్యాలు పండుతాయి.
(8)చిత్తడి నేలలు (Peaty and Marshy Soils):
  • ఇవి తేమ, బురదతో కూడిన నేలలు. అందువల్ల వ్యవసాయానికి నిరుపయోగం.
  • ఇవి ఎక్కువగా కేరళలో విస్తరించాయి. ఇవి ఆమ్లత్వం కలిగి ఉండి నలుపురంగులో ఉంటాయి. కేరళలో వీటిని స్థానికంగా కరి నేలలు అంటారు.

వీటిని కూడా చూడండీ: