History of International Day of Persons with Disabilities (IDPD) in Telugu | అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం |
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం - డిసెంబర్ 3
ఉద్దేశ్యం:
- వైకల్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం మరియు వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు మరియు శ్రేయస్సు కోసం మద్దతునివ్వడం మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశాలలో వికలాంగుల పరిస్థితిపై అవగాహన పెంచడం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities (IDPD) ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
- 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించింది.
- అలాగే, 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది.
- 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై, 1998 నుండి ప్రతి సంవత్సరం అన్ని దేశాలు ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.
- దీనిని 2007 వరకు International Day of Disabled Persons అని పిలిచేవారు.
ఈరోజు కార్యక్రమాలు:
- ఈ దినోత్సవం రోజున ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. వికలాంగులకు కాలిబర్, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు వంటివి బహుకరిస్తారు.
గణాంకాలు:
- 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభాలో 2.21 శాతం లేదా సుమారు 26.8 మిలియన్ల మంది భారతీయులు వైకల్యంతో బాధపడుతున్నారు.
వికలాంగుల చట్టాలు:
- దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 1995 వరకు దివ్యాంగుల కోసం ఎలాంటి చట్టమూ లేదు. మన రాజ్యాంగంలో వారి కోసం ప్రత్యేకంగా లిఖించదగిన ప్రకరణ లేదు. 41వ ఆర్టికల్ లో వారి శ్రేయస్సు గురించి పేర్కొన్నప్పటికీ, అది ఆదేశిక సూత్రమే. కాబట్టి దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు తప్పనిసరిగా పరిరక్షించాలన్న షరతు ఎక్కడా లేదు.
- UNO దీర్ఘకాలం తెచ్చిన ఒత్తిళ్ల ఫలితంగా విభిన్న ప్రతిభావంతుల చట్టం 1995ను భారత ప్రభుత్వం తీసుకువచ్చింది.
- ఈ చట్టం ప్రకారం వారికి సమానమైన హక్కులు పూర్తి భాగస్వామ్యం, సరిసమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేసింది.
- దీనిలో ఏడు రకాల వికలాంగులు, వారికి సంబంధించి ప్రత్యేక రక్షణలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు.
- 1995లో చేసిన దివ్యాంగుల చట్టం దేశంలోనే మొట్ట మొదటిది.
Campaign):
- ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సుగమ్య భారత్ ప్రచారాన్ని ప్రభుత్వం 2015 డిసెంబరు 3న ప్రారంభించింది.
- వికలాంగులకు ప్రజారవాణా సౌకర్యం, విహా రయాత్ర స్థలాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు చేరువ చేయడమే సుగమ్య భారత్ లక్ష్యం.
- భారత ప్రభుత్వం 2016 డిసెంబరు 16న ఈ బిల్లును ఆమోదించింది. అనంతరం ఈ బిల్లు చట్ట రూపం దాల్చింది.
- దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను గుర్తించారు.
(1) అంధత్వం (2) కుష్ఠు (3) దృష్టి లోపం (4) వినికిడి లోపం (5) చలన వైకల్యం (6) మరుగుజ్జుతనం (7)బుద్ధిహీనత (8) మానసిక సమస్యలు (9) ఆటిజం (10) సెరిబ్రల్ ఫ్లాసీ (11) మస్కులర్ డిస్ట్రోఫీ (12) నాడీ సంబంధిత సమస్యలు (13) స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ (14) మల్టిపుల్ స్లెరోసిస్ (15) మాట్లాడలేకపోవడం (16) తలసేమియా (17) హిమోఫిలియా (18) సికెల్ సెల్ డిసీజ్ (19) మల్టిపుల్ డిజేబిలిటీస్ (20) యాసిడ్ దాడి బాధితులు (21) పార్కిన్సన్స్ బాధితులు.
- దివ్యాంగుడిగా గుర్తించాలంటే కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. అలాగే సదరి సర్టిఫికేట్ పొంది ఉండాలి.
- దివ్యాంగులపై ఎవరైనా వివక్షతో ప్రవర్తిస్తే వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. 06 నెలల నుంచి 02 సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా పది వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
- 2016 చట్ట ప్రకారంగా ఏ రకమైన దివ్యాంగులు అయినప్పటికీ తమ పని తాము చేసుకోలేని వారు ప్రభుత్వ లావాదేవీలు నడిపించడానికి, ఇతరత్రా సౌకర్య సదుపాయాల కోసం ఇద్దరు సంరక్షకులను నిర్మించుకోవడానికి అనుమతిస్తుంది.
- ఈ చట్టం ప్రకారం విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కేటాయించడం, గరిష్ట వయోపరిమితికి ఐదు సంవత్సరముల సడలింపు ఇవ్వడం జరిగింది.
- ఒకసారి వికలాంగునిగా గుర్తింపు పొందితే అది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
- ఈ చట్టం ప్రకారం జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల ప్రయోజనం కొరకు నిధులు కేటాయించాలి.
Themes (థీమ్స్):
- 1998: Arts, Culture and Independent Living
- 1999: Accessibility for all for the new Millennium
- 2000: Making information technologies work for all
- 2001: Full participation and equality: The call for new approaches to assess progress and evaluate outcome
- 2002: Independent Living and Sustainable Livelihoods
- 2003: A Voice of our Own
- 2004: Nothing About Us Without Us
- 2005: Rights of Persons with Disabilities: Action in Development
- 2006: E-Accessibility
- 2007: Decent Work for Persons with Disabilities
- 2008: Convention on the Rights of Persons with Disabilities: Dignity and justice for all of us
- 2009: Making the MDGs Inclusive: Empowerment of persons with disabilities and their communities around the world
- 2010: Keeping the promise: Mainstreaming disability in the Millennium Development Goals towards 2015 and beyond
- 2011: Together for a better world for all: Including persons with disabilities in development
- 2012: Removing barriers to create an in clusive and accessible society for all
- 2013: Break Barriers, Open Doors: for an inclusive society and development for all
- 2014: Sustainable development: The promise of technology
- 2015: Inclusion matters: access and empowerment for people of all abilities
- 2016: Achieving 17 Goals for the future we want
- 2017: Transformation toward sustainable and Resilient society for all
- 2018: వైకల్యాలున్న వ్యక్తులను శక్తివంతం చేయడం మరియు సమగ్రత మరియు సమానత్వాన్ని నిర్ధారించడం. (Empowering persons with disabilities and ensuring inclusiveness and equality)
- 2019: వికలాంగుల భాగస్వామ్యాన్ని మరియు వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడం: 2030 అభివృద్ధి అజెండాపై చర్యలు తీసుకోవడం.(Promoting the participation of persons with disabilities and their leadership: taking action on the 2030 Development Agenda)
- 2020: Building back better: towards an inclusive, accessible and sustainable post COVID-19 world by, for and with persons with disabilities
వీటిని కూడా చూడండీ: