దేవాలయాలపై శృంగార శిల్పాలు ఉండడం వెనుక 8 కారణాలు

Why are erotic sexsual sculptures on the temples in telugu

8 Reasons behind erotic sculptures on the temples

దేవాలయాలపై శృంగార శిల్పాలు
ఉండడం వెనుక 8 కారణాలు

  • భారతదేశం లౌకిక (Secular) దేశం. 
  • భారతదేశంలో ఎక్కువ మంది  హిందువులే (96.62కోట్లు). హిందువుల పవిత్ర స్థలం దేవాలయం (Temple).
  • హిందువుల చాలా దేవాలయాల గోడల మీద,గోపురాల మీద శృంగార శిల్పాలు (Erotic Sculptures) ఉంటాయి.
  • దేవాలయాలపై ఈ విధమైన శృంగార బొమ్మలు ఎందుకు ఉన్నాయో, ఎందుకు ఉండాలో ఏ గ్రంథంలోను చెప్పబడలేదు.
  • కానీ, కొందరు మేధావులు బహుషా ఈ క్రింది కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు.


(1) శృంగారాన్నీ ఒక పుణ్య కార్యంగా భావించడం:

  • మానవులు తమ జీవితంలో నెరవేర్చ వలసిన 4  విధులను (పురుషార్థాలను) ఋగ్వేదం తెలిపింది. అవి:

        (1)ధర్మం(Duty,Ethics)   
        (2)అర్థం(Prosperity,Wealth)
        (3)కామం(Pleasure,Sensur  gratification)
        (4)మోక్షం(The pursuit liberation)
  • ఇందులో కామం కూడా ఉందీ కాబట్టి, ప్రాచీన హిందూ మతంలో శృంగారం అనేది పాపం కాదు. 
  • శృంగారమే తప్పు కానప్పుడు,శృంగార బొమ్మలను పెట్టడం పాపమో లేక తప్పో ఎలా అవుతుంది.పైగా శృంగార బొమ్మలు ఉండటం వల్ల దేవాలయాలు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి.

(2) రాజులు తమ సైన్య బలం పెంచుకోవడానికి:

  • పూర్వ కాలంలో రాజ్యాలుండేవి.వాటిని రాజులు పాలించేవారు.
  • రాజ్యంలో దేవాలయాలన్నీ దాదాపు రాజులే నిర్మించేవారు.దేవాలయం ప్రతీ ఒక్కరూ రోజూ సందర్షించే ప్రదేశం కాబట్టి,నిర్మించే క్రమంలోనే శృంగార శిల్పాలను చెక్కించేవారు.
  • దేవాలయానికి వచ్చిన వారిలో ఆ శిల్పాలు సంభోగంలో పాల్గొనేలా ప్రేరేపించేవి. ఫలితంగా,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లేనీ ఆ కాలంలో డజన్ల కొద్ది సంతానానికి జన్మనిచ్చేవారు.
  • వారు సైన్యంలో చేరడం ద్వార సైనిక బలం పెరిగేది.


(3) శృంగారం గురించి అవగాహన కల్పించడానికి:
  • మనకు తెలియని విషయాన్నీ గూగుల్ ద్వారా తెలసుకుంటాము.
  • కానీ ప్రాచీన కాలంలో ఇలాంటి సదుపాయం లేదు కాబట్టీ.... మానవ జాతీ మనుగడకు అత్యవసరమైన శృంగారం గురించీ, అందులోని భంగిమల గురించీ,  ప్రజలకు అవగాహన కల్పించడానికి… ప్రజలు  ప్రతీ రోజూ సందర్శించుకునే దేవాలయాలపై శృంగార బొమ్మలను చెక్కించేవారు.

(4) భక్తి ధ్యాసలో పడి శృంగార/సంసార జీవితాన్ని మర్చిపోకూడదని:

  • పూర్వ కాలంలో ప్రజలకు దైవభక్తి ఎక్కువగా ఉండేది.
  • అతి భక్తి ఉన్నవాళ్ళు దేవాలయాలలోనే ఎక్కువ సమయం గడిపేవారు.
  • అలాంటి వారు తమ శృంగార/సంసార జీవితాన్నీ మర్చిపోకుండా ఉండేందుకు, దేవాలయాలపై శృంగార బొమ్మలను చెక్కించేవారు.

(5) దేవునిపై దృష్టి దోషం పడకూడదని:

  • భవనాలకు దృష్టిదోషం పడకూడదని రాక్షస బొమ్మలను వేలాడదీసినట్టే...గర్భగుడిలోనీ మూలవిరాట్ కు దృష్టి దోషం తగలకుండా ఉండేందుకు దేవాలయాల మీద శృంగార బొమ్మలను చెక్కించేవారు.
  • భక్తుల దృష్టీ మొదట దేవాలయం బయట ఉన్న శృంగార బొమ్మలపై పడి,తరువాత దేవాలయం లోపల ఉన్న మూలమూర్తిపై  పడడం ద్వారా మూలమూర్తీపై దృష్టిదోషం పడదు.

(6) మానవ జాతీ మనుగడ కోసం:

  • ఈ ఆధునిక కాలంలో ఆడ,మగ సంభోగించు కోలేకపోయిన,నూతన టెక్నాలజీ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించి,మానవ జాతి మనుగడను కాపాడవచ్చు.
  • కానీ ప్రాచీన కాలంలో ఆడ,మగ సంభోగం  ద్వారానే పిల్లలను కని,మానవ జాతీ మనుగడను కాపాడేవారు. 
  • లోక కల్యాణం కోసం ఆడ,మగ సంభొగం చేసుకోవాలనే విషయం ప్రతీ ఒక్కరికి తెలియాలని దేవాలయాలపై శృంగార శిల్పాలను చెక్కించేవారు.

(7) భక్తులు ప్రశాంతంగా, ఏకాగ్రతతో దేవున్నీ దర్శించుకోవాలని:

  • ఎవరైనా గానీ శృంగార బొమ్మలను చూస్తే Tensions మర్చిపోయి Attention అయిపోతారు.
  • ఆ సమయంలో ప్రశాంతంగా,ఏకాగ్రతతో దృష్టిని ఒకేచోట కేంద్రీకరిస్తారు.
  • ఇలా దేవాలయానికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా, ఏకాగ్రతతో దేవున్నీ దర్శించుకోవాలని...దేవాలయాలపై శృంగార శిల్పాలను చెక్కించేవారు.

(8) దేవాలయానికి వచ్చేవారి సంఖ్యను పెంచడానికి:

  • దేవాలయానికి వచ్చేవారి సంఖ్యను పెంచడానికి(వారిని ఆకర్షించడానికి)ఎత్తులో ఉన్న దేవాలయాల గోపురాలపై,గోడలపై శృంగార శిల్పాలను చెక్కించేవారు.
  • దేవాలయానికి ఎక్కవ మంది రావడం వల్ల... ధక్షిణ,కానుకలు,విరాళాలు ఎక్కువగా వచ్చేవి. దీని ద్వారా దేవాలయ ఆదాయం పెరిగేది.   
  • ఈ ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధీ పనులతో పాటు,పూజలు చేసే బ్రాహ్మణుల ఇంటి అవసరాలకు ఉపయోగించేవారు.
  • అలాగే ఎక్కువ మంది ప్రజలను దేవునికి దగ్గర చేయడం కోసం.


NOTE:
  • దేవాలయాల పైన ఉన్న శృంగార బొమ్మల భంగిమలు... చాలా వరకు వాత్సాయనుడు ‘కామసూత్రం’లో చెప్పినవే ఉంటాయి.


  • శృంగార శిల్పాలను కలిగి ఉన్న భారతదేశపు కొన్నీ సుప్రసిధ్ధ దేవాలయాలు:
1)సూర్య దేవాలయం(మొదేరా,గుజరాత్)
2)ఖజురవో దేవాలయం(మధ్యప్రదేశ్)
3)బొరందేవ్ దేవాలయం(ఛత్తీస్గడ్)
4)రాణక్ పూర్ దేవాలయం(రాజస్థాన్)
5)విరుపాక్ష దేవాలయం(హంపీ)
6)లింగరాజు దేవాలయం(బువనేశ్వర్)
7)ఓసాన్ దేవాలయం(రాజస్థన్)
8)చెన్నకేశవ దేవాలయం(సోమనాథ్ పుర్)
9)కైలాసనాథ దేవాలయం(ఎల్లోరా)
10)మార్కండేశ్వర దేవాలయం(మహారాష్ట్ర)

NOTE:
ఈ 8 కారణాల్లో మీకు ఏదీ Most Reasonable గా అనిపించిందో commentలో తెలియజేయండీ.