Table of Content :-
వైఎస్సార్ కళ్యాణమస్తు - వైఎస్సార్ షాదీ తోఫా:
- వైఎస్సార్ కళ్యాణమస్తు మరియు వైఎస్సార్ షాదీ తోఫా పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైెఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.
- ఈ రెండు పథకాలను 1 అక్టోబర్ 2022 న ప్రారంభించారు.
- వధూవరులు వివాహమైన 30 రోజుల లోపు తమ దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఫిబ్రవరి, మే, ఆగస్టు మరియు నవంబర్ లలో ఆయా త్రైమాసికాలకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయబడుతుంది.
- రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనే, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమచేయబడుతుంది.
- వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్: 1902
- YSR Kalyanamasthu, Shaadi Tohfa Scheme Guidelines (PDF)
- More
కావాల్సిన తప్పనిసరి డాక్యుమెంట్లు:
Mandatory Documents
- మ్యారేజ్ సర్టిఫికేట్
- వధువు, వరుడు ఆధార్ కార్డులు.
- పెళ్లి ఫోటోలు
- పెళ్లి కార్డు
- వికలాంగులు అయితే శాశ్వత వికలాంగత్వం ధృవీకరించే SADAREM సర్టిఫికేట్
- వితంతువు అయితే ముందు భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు. రెండు లేకపోతే అఫిడవిట్
- APBOCWWB రిజిస్ట్రేషన్ గుర్తింపు కార్డు (భవన, ఇతర నిర్మాణ కార్మికులకు మాత్రమే) (వధువు / వధువు తల్లిదండ్రుల కార్డు)
క్ర.సం | కేటగిరి | ఆర్థిక సాయం (రూ.లలో) |
---|---|---|
1 | ఎస్.సి | 1,00,000/- |
2 | ఎస్.సి (కులాంతర వివాహం) |
1,20,000/- |
3 | ఎస్.టి | 1,00,000/- |
4 | ఎస్.టి (కులాంతర వివాహం) |
1,20,000/- |
5 | బి.సి | 50,000/- |
6 | బి.సి (కులాంతర వివాహం) |
75,000/- |
7 | మైనారిటీలు | 1,00,000/- |
8 | విభిన్న ప్రతిభావంతులు | 1,50,000/- |
9 | భవన, ఇతర నిర్మాణ కార్మికులు | 40,000/- |
అర్హతలు | |
---|---|
వయస్సు | వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి. |
వివాహాల సంఖ్య | వితంతువుల విషయంలో మినహా తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది. (మగ వితంతువులు అనర్హులు) |
విద్యాపరమైన అర్హతలు | వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. |
ఆదాయ ప్రమాణాలు | వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి. |
మూడు ఎకరాలలోపు మాగాణి ఉండాలి. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి. | |
కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ, ప్రభుత్వ సంస్థల్లో గానీ, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షర్ గా ఉండకూడదు. అయితే పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది. | |
నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు) | |
నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. | |
ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. | |
మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండకూడదు. |