- జీవులలో అంతర లేదా బాహ్యంగా ఉండే గట్టి, దృఢమైన ఆకారం మరియు రక్షణనిచ్చే నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు.
- ఇది జీవులలో రెండు రకాలు. అవి:
- (1) బాహ్య అస్థిపంజరం (Exoskeleton)
- (2) అంతర అస్థిపంజరం (Endoskeleton)
(1) బాహ్య అస్థిపంజరం:
- ఇది దృఢమైన, రక్షణనిచ్చే బయటి నిర్జీవ పొర.
- ఉదా: గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు మొదలైనవి.
- మొలస్కా జీవుల బాహ్య అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది.
(2) అంతర అస్థిపంజరం:
- ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్ధిష్ట ఆకారాన్ని మరియు యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది.
- దీనిలో రెండు రకాల ఎముకలు కలవు. అవి:
- (i) మృదులాస్థి (Cartilage)
- (ii) అస్థి (Bone)
(i) మృదులాస్థి (Cartilage):
- ఇవి మెత్తగా, మృదువుగా ఉంటాయి.
- వీటి అధ్యయనం: కాండ్రాలజీ
- వీటిలో ఉండే ప్రోటీన్: కాండ్రిన్
- దీనిలో ఉండే కణాలు: కాండ్రోసైట్స్
- ఇవి కొల్లాజన్ అనే సాగే గుణం కలిగి ఉన్న ప్రోటీన్ ను కలిగి చలనానికి సహాయపడును.
- కొల్లాజన్ మానవ శరీరంలో అత్యధికంగా ఉండే ప్రోటీన్.
- ఉదా: వెలుపలి చెవి, ముక్కు కొన, కొండ నాలుక, సొరచేపలోని అస్థిపంజరం మొదలైనవి.
(ii) అస్థి (Bone):
- గట్టిగా, దృఢంగా ఉండే ఎముక.
- ఇవి దృఢంగా ఉండడానికి కారణం: కాల్షియం, ఫాస్పరస్
- ఫాస్పరస్ కు మండే స్వభావంవల్ల శవాలను కాల్చినపుడు కాంతివంతంగా మండును.
- వీటి అధ్యయనం: ఆస్టియాలజీ (Osteology)
- వీటిలో ఉండే కణాలు: ఆస్టియోసైట్స్
- ఎముకలలో ఉండే ప్రోటీన్: ఆస్టీన్
- ఎముకల సంఖ్య:
- మొత్తం: 206
- పుట్టినపుడు చిన్నపిల్లల్లో: 300
- తల: 29 (కపాలం: 8, ముఖం: 14, చెవి: 6, నాలుక క్రింద: 1)
- చెతులు: 30+30 = 60
- కాళ్ళు: 30+30 = 60
- వెన్నెముక: 26 (చిన్నపిల్లల్లో: 33)
- ప్రక్కటెముకలు: 12+12 = 24
- రొమ్ము ఎముక: 1
- చరక సంహిత ప్రకారం మానవ శరీరంలోని ఎముకల సంఖ్య (దంతాలతో సహా): 360
- ఎముకల వ్యాధులు:
- అర్ధరెటీస్: ఇది సాధారణ కీళ్ళనొప్పి
- రికెట్స్: చిన్నపిల్లల్లో ఎముకలు వంగడం
- ఆస్టియో మలేషియా: పెద్దవారిలో ఎముకలు మెత్తగా మారడం
- ఆస్టియో సార్కోమా: ఎముకలకు వచ్చే క్యాన్సర్
- ఫ్లోరోసిస్: దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపాలలోకి మారడం
- ప్రతీ వ్యక్తికి కావలసిన ఫ్లోరిన్ పరిమాణం: 1 Mg/లీటర్
- నీటిలో ఉండవలసిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం: 0.7 Mg - 1.2 mg/లీటర్
- ప్రాముఖ్యతగల ఎముకలు:
- అతిపెద్ద, అతి పొడవైన, గట్టి ఎముక: ఫీమర్/ తొడ ఎముక
- అతిచిన్న ఎముక: స్టెపిస్/ కర్ణాంతరాస్థి
- పుర్రెలో అతి గట్టిది: క్రింది దవడ (Mandible)
- ఇతర అంశాలు:
- పాక్షికంగా కదిలే ఎముకలు కంటి వలయంలో ఉంటాయి.
- కదిలే ఎముకల మధ్యలో ఉండి కందెనల పనిచేసే ద్రవం: సైనోవియల్ ద్రవం
- మానవుని నాలుక కింద ఉండే ఎముక: హయడ్
- చెవిలో ఉండే ఎముకలు: మాలస్, ఇంకస్, స్టేప్స్
- అస్థిమజ్జలోని ఎరిత్రోపాటియన్ అనే ప్రోటీన్ వల్ల RBC ఉత్పత్తి జరుగును
- ఈ ఎరిత్రోపాటియన్ ను స్రవించేది: మూత్రపిండం
- అస్థిపంజర వ్యవస్థలో భాగం అయిన ఎముకలు లేని శరీర భాగం: పళ్ళు
- మానవుని వయస్సు నిర్ధారణకు ఉపయోగపడే పరీక్ష: Bone Ossification Test
- ఎముకలోని ఎపిఫైసియల్ ఫలకం పొడవు పెరగడానికి తోడ్పడును.
- ఎముకను, ఎముకతో కలిపేది: సంధి బంధనాలు (లిగమెంట్స్)
- ఎముకను, కండరంతో కలిపేది: స్నాయు బంధనాలు (టెండాన్)
- రెండు లేదా ఎక్కువ ఎముకలు లిగమెంట్ అనే పట్టీల సహాయంతో అతికే ప్రదేశాన్ని కీలు (Joint) అంటారు.
- కీళ్ళు (Joints) అధ్యయనం: ఆర్థ్రాలజీ
- మానవ శరీరంలో మొత్తం 230 కీళ్లు ఉంటాయి.
- కీళ్ళలో యూరికామ్ల స్పటికాలు జమకూడడం వల్ల కలిగే వ్యాధి: గౌట్
- కీళ్ళు-రకాలు:
- బంతిగిన్నె కీలు (Ball & Socket Joint): భుజము
- మడతబందు కీలు (Hinge Joint): మోచేయి, మోకాలు
- జారెడు కీలు (Gliding Joint): వెన్నెముక, మణికట్టు
- బొంగరపు కీలు (Pivot Joint): మెడ
- ఇరుసు కీలు: మెడ, తలతో బంధించే కీలు
కండరాలు (Muscles):
- ఎముకలకు అంటిపెట్టుకుని ఉండే కణజాల నిర్మాణాలను కండరాలు (Muscles) అంటారు.
- వీటి అధ్యయనం: మయాలజీ/ సార్కాలజీ
- వీటి విధి: సంకోచ, సడలికలు చెంది ఎముకలను కదల్చడం.
- కండర సంకోచానికి ఉపయోగపడే మూలకాలు: కాల్షియం అయాన్స్
- కండరాలలో ఉండే వర్ణకం: మయోగ్లోబీన్
- కండరాల్లో ఉండే ప్రొటీన్: మయోసిన్
- కండరాల గురించి వివరించే సిద్ధాంతం: స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం.
- దీన్ని హక్సలే ప్రతిపాదించాడు.
- మానవునిలోని కండరాలు: 639
- కండరాలకు వచ్చే క్యాన్సర్: సార్కోమా/ మయోమా
- కండరాలు మూడు రకాలు:
- నియంత్రిత కండరాలు: ఈ కండరాలు మన శరీరం ఆధీనంలో ఉంటాయి, ఇవి కాళ్లు, చేతుల్లో ఉంటాయి.
- అనియంత్రిత కండరాలు: ఈ కండరాలు శరీరం నియంత్రణలో ఉండవు. ఇవి పేగులు, గర్భాశయం, మూత్రాశయం, కనురెప్పల్లో ఉంటాయి.
- హృదయ కండరాలు: ఇవి హృదయంలోనే ఉంటాయి. ఇవి రక్తాన్ని పంపు చేయడంలో సహాయపడతాయి. ఈ కండరాలు నిర్మాణంలో నియంత్రిత కండరాలు, విధుల్లో నియంత్రిత కండరాలను పోలి ఉంటాయి.
- కండరాల అపస్థితులు:
- టెటాని: టెటాని అంటే పారాథార్మోన్ లోపంవల్ల ఎల్లప్పుడూ సంకోచం చెందడం. దీని ఫలితంగా ఎముకలు కదలవు.
- కండర గ్లాని: కండరాలు ఎల్లప్పుడు పనిచేయడం వల్ల దానికి సరైన ఆక్సిజన్ అందక అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం ఏర్పడటం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి.
- రిగర్ మోర్టిస్: జీవి చనిపోయిన తర్వాత దానిలో ATP ఉత్పత్తి కాకపోవడం వల్ల ఆక్టిన్, మయోసిన్ అనే కండరాల ప్రొటీన్స్ పనిచేయక శరీరం గట్టిగా మారుతుంది.
- మఖ్యమైన కండరాలు:
- అతిపెద్ద కండరం: గ్లుటియస్ మాక్జిమస్ (పిరుదు కండరం)
- అతి చిన్న కండరం: స్టెపీడియస్ (చెవి కండరం)
- అతి పొడవైన కండరం: సార్టోరియస్ (తొడ కండరం)
- అతి బలమైన కండరం: మాసెటర్ (దవడ కండరం)