Table of Contents:-
- పరిచయం
- జీర్ణ/ ఆహారనాళం (Alimentary Canal)
- (1) నోరు (Mouth)
- (2) ఆస్యకుహరం (Oral Cavity)
- (3) గ్రసని (Pharynx)
- (4) ఆహారవాహిక (Esophagus)
- (5) జీర్ణాశయం (Stomach)
- (6) చిన్నపేగు (Small Intestine)
- (7) పెద్దపేగు (Large Intestine)
- (8) పాయువు (Anus)
- జీర్ణ గ్రంథులు (Digestive Glands)
- జీర్ణక్రియ (Digestion)
- వీటిని కూడా చూడండీ
- జీవులు తినే ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి వివిధ భాగాలతో కూడిన ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దాన్నే జీర్ణ వ్యవస్థ (Digestive System) అంటారు.
- జీర్ణవ్యవస్థ ఆహారంలోని పోషకాలను గ్రహించి, వ్యర్థాలను విసర్జిస్తుంది. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తి సమకూరుతుంది.
- కీటకాలు, జలచరాలు, జంతువుల వంటి పక్షులు, అన్ని జీవుల్లోనూ ఈ వ్యవస్థ ఉంటుంది. శాకాహార, మాంసాహార జంతువుల్లో వేర్వేరుగా ఉంటుంది.
- సంక్లిష్ట ఆహార పదార్థాలు ఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహార పదార్థాలుగా మార్చబడడాన్ని జీర్ణక్రియ (Digestion) అంటారు. ఇది జీర్ణవ్యవస్థలో జరుగుతుంది.
- జీర్ణవ్యవస్థలో జీర్ణ/ ఆహారనాళం, దాని అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథులు విడుదల చేసే జీర్ణ రసాల్లోని ఎంజైమ్‌లు జీర్ణ క్రియను నిర్వహిస్తాయి.
మానవ జీర్ణ వ్యవస్థ
(Human Digestive System)
జీర్ణ/ ఆహారనాళం
(Alimentary Canal)
- ఇది నోటితో ప్రారంభమై పాయువుతో అంతమయ్యే గొట్టంవంటి నిర్మాణం.
- దీని పోడవు: 9 మీటర్లు/ 30 అడుగులు
- దీనిలోని భాగాలు:
- (1) నోరు (Mouth)
- (2) ఆస్యకుహరం (Oral Cavity)
- (3) గ్రసని (Pharynx)
- (4) ఆహారవాహిక (Esophagus)
- (5) జీర్ణాశయం (Stomach)
- (6) చిన్నపేగు (Small Intestine)
- (7) పెద్దపేగు (Large Intestine)
- (8) పాయువు (Anus)
(1) నోరు (Mouth):
- దీని ద్వారా ఆహారం ఆహార నాళంలోకి చేరే విధానాన్ని అంతర్ గుహణం (Ingestion) అంటారు.
(2) ఆస్యకుహరం (Oral Cavity):
- నోటిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఆస్యకుహరం అంటారు.
- ఆస్యకుహరం మరియు నాసికా కుహరాన్ని వేరు చేసే నిర్మాణం: తాలువు/ అంగిలి (Palate)
- దీనిలోని భాగాలు:
(i) దంతాలు (Teeth):
- దంతాల అధ్యయనం: ఒడెంటాలజి
- ఇవి డెంటిన్ అనే పదార్థంచే ఏర్పడును.
- దీనిని ఒడెంటో బ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి.
- దంతాలను కప్పుతూ ఉండే మెరిసే పొరను ఎనామిల్/ పింగాణి అంటారు.
- ఇది మానవ శరీరంలో అత్యంత గట్టి/ దృఢమైన పదార్థం.
- దీనిని ఎమియో బ్లాస్ట్ కణాలు స్రవిస్తాయి.
- మానవ జీవితంలో రెండుసార్లు మాత్రమే దంతాలు వచ్చును.
- చేపల వంటి నిమ్న సకశేరుకాలలో అనేకసార్లు దంతాలు ఏర్పడతాయి.
- ఎక్కువ దంతాలుగల జీవులు;
- అపోసం: 50
- గుర్రం మరియు పంది: 44
- దంతాలు లేని జీవులు: నెమలి, ఆస్ట్రిచ్, తాబేలు మెదలైనవి
- మానవులలో దంతాలు రెండు రకాలు:
- (a) పాల దంతాలు (Primary Teeth):
- ఇవి చిన్న పిల్లల్లో ఉండును.
- 8-9 సంవత్సరాల వయస్సులో ఊడిపోవును.
- వీటి సంఖ్య: 20.
- వీరిలో 8 అగ్ర చర్వణకాలు, 4 జ్ఞాన దంతాలు (మొత్తం 12) లోపించును .
- పాల దంతాల సూత్రం: 2102/2102
- (b) శాశ్వత దంతాలు (Permanent Teeth):
- పాల దంతాలు ఊడిపోయి తర్వాత వాటి స్థానంలో కొత్త దంతాలు వస్తాయి. వీటినే శాశ్వత దంతాలు అంటారు.
- వీటి సంఖ్య: 32
- వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రం: దంత సూత్రం
- దంత సూత్రం: 2123/2123
- దంతాలు 4 రకాలు:
- (a) కుంతకాలు (Incisors):
- వీటి సంఖ్య: 8
- ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయాగపడతాయి. కావున వీటిని కొరకు పళ్ళు అంటారు.
- (b) రదనికలు (Canines):
- వీటి సంఖ్య: 4
- ఇవి మాంసహారులలో మాత్రమే అభివృద్ధి చెంది, మొనదేలి ఉంటాయి. కావున వీటిని కోరపళ్ళు, చీల్చు దంతాలు అంటారు.
- పాములలో కోరలు వీటి రూపాంతరమే
- ఇవి శాఖాహార జంతువులలో పూర్తిగా లోపించి ఉంటాయి.
- శాఖాహారులలో ఇవి లోపించడంవల్ల ఏర్పడే ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అంటారు.
- ఉదా: కుందేలు
- (c) అగ్ర చర్వణకాలు (Premolars):
- వీటి సంఖ్య: 8
- ఆహారాన్ని నమలడం వల్ల నమలు దంతాలు అంటారు.
- (d) చర్వణకాలు (Molars):
- వీటి సంఖ్య: 12
- ఆహారాన్ని లోపలికి విసరడంవల్ల విసురు దంతాలు అంటారు.
- ఇవి 17 సంవత్సరాల వరకు 8 మాత్రమే ఉండి, 17-25 సంవత్సరాల మధ్య కాలంలో మిగతా 4 ఏర్పడుతాయి.
- కొత్తగా ఏర్పడిన 4 దంతాలనే జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటారు. జ్ఞాన దంతాలను అవశేష అవయవాలుగా పరిగణిస్తారు.
- దంత వ్యాధులు (Dental Diseases):
- పయేరియా/ పైరియా: దంతాలు, చిగుళ్ళ మధ్య చీము ఉత్పత్తి.
- జింజివైటిస్: రెండు దంతాల మధ్య ఉండే చిగురు వాయడం
- ఫ్లోరోసిస్: దంతాలు బంగారు, పసుపు రంగులోకి మారడం
- దంతక్షయం: బాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లం వల్ల దంతంపై ఎనామిల్ క్షీణించును.
(ii) లాలాజల గ్రంథులు (Salivary Glands):
- ఇవి మానవునిలో 3 జతలు ఉండును. (మిగతా క్షీరదాలలో 4 జతలు ఉండును)
- పెరోటిడ్ గ్రంథులు (Parotid Glands): చెవి దగ్గర ఉండును.
- అథోజంబికా గ్రంథులు (Submandibular Glands): రెండు దవడలు కలిసే చోట ఉండును.
- అధోజిహ్వికా గ్రంథులు (Sublingual Glands): నాలుక క్రింద ఉండును.
- పాములలో పెరోటిడ్ గ్రంథులు మార్పు చెంది విష గ్రంథులుగా ఏర్పడును.
- లాలాజల గ్రంథులు రోజుకి ఒక లీటర్ లాలాజలం (Saliva) ని ఉత్పత్తి చేయును.
- లాలాజల PH: 6.8
- లాలాజలంలోని ఎంజైమ్: టయలిన్/ అమైలేజ్
- ఇది పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది.
- లాలాజలంలో మ్యూసిన్ (Mucin) అనే జిగట పదార్థం ఉంటుంది. ఇది ఆహారం చుట్టూ చుట్టి బోలస్ అనే ముద్దను ఏర్పచును.
- లాలాజలం యొక్క రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్ష: లిట్మస్ పేపర్ పరీక్ష
(iii) నాలుక (Tongue):
- ఇది ఒక జ్ఞానేంద్రియము, కండరయుత నిర్మాణం.
- నాలుకపైన రుచులను గుర్తించే నిర్మాణాలను గ్రాహకాలు (Taste Receptors) అంటారు.
- అస్యకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులమ్ అనే కణజాలంతో నాలుక అతికి ఉంటుంది.
- నాలుక పై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకుని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు (Papillae) అంటారు.
- వీటి ముఖ్య విధి రుచులను గుర్తించడం.
- రుచులను గుర్తించే చర్యను గస్టేషన్ అంటారు.
- సూక్ష్మాంకురాలు (Papillae) 4 రకాలు:
- Fungiform Papillae: ఇవి నాలుక చివర భాగంలో ఉండును.
- Filiform Papillae: ఇవి నాలుక ఉపరితలంలో ఉంటాయి. ఇవి రుచి మొగ్గలను కలిగి ఉండవు.
- Circumvallate Papillae: ఇవి నాలుక ఆధార భాగంలో ఉండును.
- Foliate Papillae: ఇవి నాలుక పక్క భాగంలో ఉండును.
(3) గ్రసని (Pharynx):
- ఇది వాయు మార్గానికి, ఆహార మార్గానికి కూడలి.
- దీనిలో ఎటువంటి జీర్ణక్రియ జరగదు.
(4) ఆహార వాహిక (Esophagus):
- ఇది సన్నగా, పొడవుగా ఉండే గొట్టం వంటి నిర్మాణం.
- దీని నుండి ఆహారం జీర్ణాశయంలోకి చేరును.
- దీనిలో కనబడే అలలవంటి కండర చలనాలు: పెరిస్టాలిసిస్
- మింగడం నియంత్రిత చర్య. మింగిన తర్వాత ఆహారవాహికను చేరగానే అది అనియంత్రితమగును.
(5) జీర్ణాశయం (Stomach):
- ఇది ఎడమవైపు ఉండే సంచి వంటి నిర్మాణం.
- జీర్ణాశయం మరియు లోపలి భాగాల అధ్యయనం: గాస్ట్రోఎంటరాలజి
- మానవుని జీర్ణాశయంలో 3 గదులు, నెమరువేసే జంతువులలో 4 గదులు ఉంటాయి.
- జీర్ణాశయంలో జఠర గ్రంథులు ఉండి జఠర రసం (Gastric Juice) ను ఉత్పత్తి చేస్తాయి.
- జఠర రసంలో HCL , పెప్సిన్, రెనిన్, జఠర లైపేజ్ అనే ఎంజైమ్ లు, మ్యూసిన్, బైకార్బోనేట్స్ ఉండును.
- HCL అధిక గాఢత కలిగి, ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మ జీవులను చంపును.
- HCL PH: 0.9 - 1.8
- జీర్ణాశయంలోని కండరాలు సంకోచ సడలిక చెంది ఘనరూప ఆహారాన్ని పాక్షిక ద్రవస్థితిలోకి మార్చును. ఇలా పాక్షికంగా జీర్ణమయిన ఆహారాన్ని కైమ్ (Chyme) అంటారు.
- జీర్ణాశయంలో ఎక్కువ కాలం (4-5 గంటలు) ఆహారం నిల్వ ఉండును.
- జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించే రసాయాలను ఆంటాసీడ్స్ అంటారు.
- జీర్ణాశయం చిన్న పేగులోకి తెరుచుకుంటుంది.
(6) చిన్నపేగు (Small Intestine):
- దీని పొడవు 7.5 మీటర్లు, వ్యాసం 3 సెం.మీ.
- ఇందులో 3 భాగాలుంటాయి.
- (a) ఆంత్రమూలము (Duodenum):
- మొదటిది, చిన్నదైనా C ఆకారపు భాగం.
- (b) జెజెనం (Jejunum):
- మధ్యలోని భాగం
- (c) శేషాంత్రికము (Ileum):
- చివరి, పొడవైన మెలికలు తిరిగిన భాగం.
- కాలేయం, క్లోమ గ్రంథులు నుండి వెలువడే జీర్ణరసాలు చిన్న పేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతాయి. ఈ గ్రంథుల స్రావాలు చిన్న ప్రేగులో క్షారస్థితిని కల్పించడానికి దోహదపడతాయి.
- చిన్న ప్రేగుల గోడలు ఆంత్రరసాన్ని (Succusentericus) స్రవిస్తాయి. ఈ స్రావాలు ప్రొటీన్లు మరియు క్రొవ్వులను మరింత చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి.
- కార్బోహైడ్రేట్స్ నోటిలో కొంతవరకు మాత్రమే జీర్ణమౌతాయి. జీర్ణాశయంలో మార్పులు చెందకుండా చిన్న ప్రేగుల్లోకి చేరిన తరువాత అక్కడ క్షారస్థితి కలిగి ఉండటం వలన పూర్తిగా జీర్ణమవుతాయి.
- చిన్నపేగులో చేతివేళవంటి ఆంత్ర చూషకాలు (Villi) అనే నిర్మాణాలు ఉండి, చిన్న చిన్న ఆహారపు రేణువులను శోషణం చేసి రక్తంలోకి పంపించును.
- మానవులలో ఎక్కువ జీర్ణక్రియ చిన్నపేగులో జరుగును.
- ఇది పెద్దపేగులో కలుస్తుంది.
(7) పెద్దపేగు (Large Intestine):
- దీని పొడవు 1.5 మీ, వ్యాసం ఎక్కువ (6 సెం.మీ).
- ఇది వ్యర్థ పదార్థాలలోని నీటిని, లవణాలను పీల్చుకుంటుంది.
- ఇందులో ఎటువంటి ఎంజైమ్స్ ఉత్పత్తి కావు.
- దీనిలో 3 భాగాలు ఉంటాయి.
- (a) అంధనాళము (Cecum):
- మొదటి, చిన్న భాగం.
- ఇది చిన్న అంధకోశాన్ని కలిగి, సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇచ్చును.
- (b) కోలాన్ (Colon):
- రెండవ, పెద్దభాగం.
- ఇందులో ముఖ్యంగా 4 భాగాలు కలవు;
- ఆరోహక కోలాన్ (Ascending colon)
- సమాంతర కోలాన్ (Transverse colon)
- అవరోహక కోలాన్ (Descending colon)
- సిగ్మాయిడ్ కోలాన్ (Sigmoid colon)
- (c) పురీషనాళం (Rectum):
- చివరి భాగం.
- వ్యర్థ పదార్థాలు దీని నుండి పాయువులోకి చేరి, అక్కడి నుండి బయటకు విసర్జింపబడును.
- ఉండుకము (Appendix):
- చిన్నపేగు మరియు పెద్దపేగు కలిసే ప్రదేశంలో పెద్దపేగుకు అతుక్కొని ఉండే వేలువంటి నిర్మాణం.
- ఇది మానవుని వంటి మాంసహారులలో ఎటువంటి పనిచేయదు. దీన్ని అవశేష అవయవము (Vestigial Organ) అంటారు.
- శాఖాహార జంతువులలో ఇది సెల్యులోజ్ ను జీర్ణం చేయును.
- దీనికి ఇన్ఫెక్షన్ కలిగినపుడు ఇది వాచీ, తీవ్రనొప్పిని కలిగించును. దీనినే Appendicitis అంటారు. దీనిని సర్జరీ ద్వారా తొలగించడం Appendectomy అంటారు.
(8) పాయువు (Anus):
- ఇది చిట్ట చివరి భాగం.
- వ్యర్థ పదార్థాలు (మలం) పెద్దపేగులోని పురీషనాళం (Rectum) లోకి, అక్కడి నుండి పాయువు (Anus) లోకి చేరి, అక్కడి నుండి బయటకు విసర్జింపబడును.
జీర్ణ గ్రంథులు
(Digestive Glands)
- జీర్ణక్రియలో పాల్గొనే గ్రంథులను జీర్ణగ్రంథులు అంటారు.
- ఉదా: లాలాజల, జఠర, ఆంత్ర, క్లోమ, కాలేయ గ్రంథులు.
కాలేయం (Liver):
- దీని అధ్యయనం: హెపటాలజి
- ఇది మానవ శరీరంలో అతిపెద్ద, అధిక బరువైన గ్రంథి.
- దీని పరిమాణం: 1.2 - 1.5 KG
- దీనిని Chemical Industry of the Body, Biochemical Laboratory అంటారు.
- ఇది శరీరానికి కావల్సిన తాత్కాలిక శక్తినిచ్చే కేంద్రం.
- దీని అతి ముఖ్యమైన లక్షణం అధిక పునరుత్పత్తిని (Regeneration Power) కలిగి ఉండడం. అనగా కోల్పోయిన భాగంలో 2-3 వారాల్లో 85% ను తిరిగి ఏర్పరచుకొనును.
- పిండ దశలో రక్త కణోత్పాధక అంగంగా, ప్రౌడ దశలో RBC విచ్ఛిత్తి అంగంగా పని చేయును.
- పేగులోకి ప్రవేశించిన విషపదార్థాలను తటస్థీకరించి మొదటి తనిఖీ కేంద్రంగా పని చేయును.
- ఎవరైతే విషపూరిత ఆహారాన్ని తిని చనిపోతే పోస్ట్ మార్టెమ్ లో తప్పనిసరిగా అతని కాలేయాన్ని పరీక్షిస్తారు.
- A, D, E, K, B12 విటమిన్లను, ఇనుమును, గ్లైకోజన్ ను నిల్వచేస్తుంది.
- ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే పైత్యరసం (Bile) ను ఉత్పత్తి చేయును.
- పైత్యరసం (Bile):
- ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటును.
- ఇది ఎర్రరక్త కణాలలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్న ఫలితంగా ఏర్పడును.
- ఇది రోజుకు 1 లీటర్ ఉత్పత్తి అగును.
- ఇందులో నీటి శాతం: 86%, PH: 7.5 - 8.5
- దీనిలో ఎంజైమ్స్ లేవు. అయినప్పటికి కొన్ని రకాల లవణాలను కలిగి కొవ్వులను చిలుకును. ఈ ప్రక్రియనే ఎమల్సీకరణం అంటారు.
- ఇది తాత్కాలికంగా పిత్తాశయంలో నిల్వ ఉండును. తర్వాత ఇది చిన్న పేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
- పిత్తాశయం (Gall Bladder):
- ఇది కాలేయ లంబికల మధ్య ఉండును.
- ఇది పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేయును.
- పిత్తాశయ రాళ్లు (Gall Stones) కొలెస్టరాల్ వల్ల ఏర్పడును.
- కాలేయ సంబంధ వ్యాధులు:
- పచ్చకామెర్లు (Hepatitis): కాలేయం ఉత్పత్తి చేసిన పైత్యరసం ఆంత్రమూలం (Duodenum) లోకి ప్రవేశించే మార్గంలో (నాళంలో) కొలెస్టరాల్ పేరుకుపోతే ఈ రసం రక్తంలో కలిసి శరీర భాగాలకు రవాణా చెందడంతో కళ్ళు, చర్మం, మూత్రం పసుపు రంగులోకి మారును.
- సిర్రోసిస్ (Cirrhosis): అధిక ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే వ్యాధి.
క్లోమం (Pancreas):
- ఇది ఆంత్రమూలం (Duodenum) వంపులో ఉండే ఆకువంటి నిర్మాణం.
- దీని అధ్యయనం: పాంక్రియాలజి
- ఇది మానవ శరీరంలో 2వ పెద్ద గ్రంథి (60 గ్రాం).
- ఇది ఒక మిశ్రమ గ్రంథి. అనగా దీనిలో నాళం గల భాగం, వినాళ (నాళ రహిత) భాగం ఉంటాయి.
- (a) నాళ భాగం (Duct Part):
- ఈ భాగానికి నాళాలు ఉండును.
- దీనిలో క్లోమ గ్రంథులు ఉండి క్లోమ రసం (Pancreatic Juice) ను ఉత్పత్తి చేయును. ఇది చిన్నపేగులోని ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
- క్లోమరసంలో ఉండే ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను జీర్ణం చేయడానికి అదే విధంగా లైపేజ్ అనే ఎంజైమ్ క్రొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.
- క్లోమ రసం PH: 8.4
- (b) వినాళ గ్రంథులు/ అంతస్స్రావిక భాగం (Endocrine Part):
- వీటిలో నాళాలు ఉండవు.
- దీనిలో లాంగర్ హాన్స్ పుటికలు అనే నిర్మాణాలు ఉండి, హార్మోన్ (ఇన్సులిన్, గ్లుకగాన్) అనే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి రక్తంలోకి విడుదల చేయును.
- ఇన్సులిన్ (Insulin):
- ఇన్సులా అనే లాటిన్ భాష పదానికి అర్దం: దీవి
- దీనిని β - కణాలు ఉత్పత్తి చేయును.
- దీనిని కనుగొన్నది: ఫ్రెడరిక్ బాంటింగ్, చార్లెస్ బెస్ట్, మెక్ లియోడ్ (ఇందుకు గాను వీరికి 1923లో నోబెల్ వచ్చింది).
- ఇది రక్తంలోని గ్లూకోజ్/చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది గ్లూకోజ్ ను గ్లైకోజన్ గా మార్చుతుంది.
- దీనిని కొలిచే పరికరం: గ్లూకోమీటర్
- ఇన్సులిన్ లోపిస్తే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, డయాబెటిస్ మెల్లిటన్/ చక్కెర వ్యాధి/ మధుమేహం వ్యాధి వస్తుంది.
- భోజనం తీసుకున్న తర్వాత రక్తంలో సాధారణంగా ఇన్సులిన్ 180 మి.గ్రా/డెసి.లీ లోపు ఉండాలి.
- అధిక ఇన్సులిన్ ఉత్పత్తి వల్ల గ్లూకోజ్ స్థాయి పడిపోవడాన్ని అనగా హైపో గ్లైసీమియా స్థితిని ఇన్సులిన్ షాక్ అంటారు. దీనివల్ల మెదడు కణాలు దెబ్బతిని ప్రాణహాని కలుగును.
- ప్రపంచ మధుమేహ దినోత్సవం: నవంబర్ 14
- కృత్రిమ ఇన్సులిన్: హ్యుమ్యులిన్
- గ్లుకగాన్ (Glucagon):
- దీనిని α - కణాలు ఉత్పత్తి చేయును.
- రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు గ్లైకోజన్ ను తిరిగి గ్లూకోజ్ గా మార్చును.
- ఇన్సులిన్ మరియు గ్లుకగాన్ లు పరస్పరం ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తూ రక్తంలోని గ్లూకోజ్ సమస్థితికి తోడ్పడును.
జీర్ణక్రియ
(Digestion)
- సంక్లిష్ట ఆహార పదార్థాలు ఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహార పదార్థాలుగా మార్చబడడాన్ని జీర్ణక్రియ (Digestion) అంటారు.
- ఎంజైమ్స్ జీవులలో మాత్రమే ఉండి చర్యలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా చర్యవేగాన్ని పెంచును.
- మానవునిలో జీర్ణక్రియ అస్యకుహరంలో ప్రారంభమై, చిన్నపేగులో అంతమగును.
- గ్రసని, ఆహారవాహిక, పెద్దపేగులో ఎంజైమ్స్ లేవు. కావున అక్కడ జీర్ణక్రియ జరగదు.
- మానవుడిలో కణ బాహ్య జీర్ణక్రియ జరుగుతుంది.
- నాడుల ద్వారా మరియు హార్మోన్ల ద్వారా జీర్ణ వ్యవస్థ నియంత్రించబడును.
జీర్ణ నాడీ వ్యవస్థ (Digestive Nervous System):
- దీనిని రెండో మెదడుగా పిలుస్తారు.
- దీనిలో సుమారు 100 మిలియన్ల నాడీ కణాలు ఉండును.
- ఇది న్యూరో ట్రాన్స్మిటర్స్ ను ఉత్పత్తి చేసి నాడీ వ్యవస్థలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉండును.
- స్వయం చోదిత నాడీ వ్యవస్థను నియంత్రించే మెదడులోని భాగం: మజ్జాముఖం
- జీర్ణ నాడీ వ్యవస్థ విధులు:
- ఆహారాన్ని చిన్నచిన్న రేణువులుగా విచ్చినం చేయడం.
- స్వీయ ప్రతిస్పందన, జ్ఞానేంద్రియ శక్తి.
- లయబద్ధమైన కండర సంకోచాలు.
- పోషకాలను గ్రహించడం మరియు వ్యర్థాలను విసర్జించడం.
హార్మోన్లు (Gastrointestinal Hormones):
- గ్రెలిన్:
- ఇది ఆకలి ప్రచోదనాలను కలిగిస్తుంది. అందుకే దీనిని ఆకలి హార్మోన్ అంటారు.
- ఆకలి సమయంలో ద్వారగోర్దం, 10వ కపాలనాడి జీర్ణాశయానికి సంకేతాలను ఇవ్వడం వల్ల గ్రెలిన్ ఉత్పత్తి అగును.
- లెఫ్టిన్:
- ఆహారం అవసరం లేనప్పుడు ఉత్పత్తి అయ్యే హార్మోన్.
- గ్యాస్ట్రిన్:
- ఇది జీర్ణాశయంలోని జఠర రస ఉత్పత్తిని ప్రేరేపించును.
- ఎంటరో గ్యాస్ట్రిన్:
- దీనిని ఆంత్రమూలం ఉత్పత్తి చేయును.
- చిన్నపేగులో కొవ్వు ఆమ్లాలు ఉండి రవాణా జరగనప్పుడు ఇది ఉత్పత్తి అగును.