Wednesday, April 12, 2023

History of MILAN Naval Exercises in Telugu | మిలాన్ నౌకాదళ విన్యాసాలు

History of Milan Naval Exercise in Telugu | మిలాన్ నౌకాదళ విన్యాసాలు | Student Soula


మిలాన్ నౌకాదళ విన్యాసాలు (MILAN Naval Exercises):
  • మిలాన్ అనేది భారత నావికాదళం నిర్వహించే బహుపాక్షిక (Multilateral) (బహుళ దేశాల) నావికాదళ విన్యాసం.
  • మిలన్ అంటే హిందీలో సమావేశం అని అర్థం
  • వివిధ దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో స్నేహపూర్వక సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి తెలియజేసేందుకు మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
  • సాగర జలాల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఆయా దేశాల మధ్య నెలకొల్పాల్సిన పరస్పర సహకారం, అక్రమ చర్యల్ని అరికట్టేందుకు కలిసి ఎలా పోరాడాలి, విపత్తులు జరిగినప్పుడు సహాయక చర్యలు మొదలైన అంశాలపై చర్చించేందుకు మిలాన్ కీలక వేదిక. 
  • ఈ విన్యాసాలను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు.
  • అయితే, అంతర్జాతీయ ఫీట్ రివ్యూ కారణంగా 2001 మరియు 2016 ఎడిషన్లు నిర్వహించలేదు, 2004 హిందూ మహాసముద్రం భూకంపం మరియు సునామీ కారణంగా 2005 ఈవెంట్ 2006 కి వాయిదా పడింది, కొవిడ్-19 కారణంగా 2020 ఎడిషన్ రద్దు చేయబడింది.
  • ఈ విన్యాసాలను 2018వరకు అండమాన్ మరియు నికోబార్ లోని పోర్ట్ బ్లెయిర్ లో నిర్వహించేవారు. కానీ, ఈ విన్యాసాలలో పాల్గొనే దేశాల సంఖ్య పెరుగుతుండడంతో విశాఖపట్నంలో ఎక్కువ మౌలిక సదుపాయాలు మరియు విన్యాసాల కోసం సముద్ర స్థలం ఉన్నందున 11వ మిలాన్ విన్యాసాలు-2022 విశాఖపట్నంలో నిర్వహించారు.
  • మిలాన్ తొలి విన్యాసాలు 1995లో నిర్వహించారు. ఇందులో ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్ లాండ్ దేశాల నౌకాదళాలు మాత్రమే పాల్గొన్నాయి.

మిలాన్ విన్యాసాలు-2022: (Double Tap Here)

  • 11వ మిలాన్ విన్యాసాలు తొలిసారిగా విశాఖపట్నంలో 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు నిర్వహించారు.
  • థీమ్స్నేహం-సమన్వయం-సహకారం (Camaraderie-Cohesion-Collaboration
  • మొత్తం 46 దేశాలకు ఆహ్వానం పంపగా, 39 దేశాలు ఇందులో పాల్గొన్నాయి. పదమూడు దేశాలు యుద్ధ నౌకలను పంపగా, మొత్తం 26 నౌకలు, 1 జలాంతర్గామీ, 21 విమానాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి.
  • ఈ విన్యాసాలు రెండు దశల్లో జరిగాయి. హార్బర్ దశ (25-28 ఫిబ్రవరి), సముద్ర దశ (1-4 మార్చి).
  • ఈ విన్యాసాల్లో భాగంగా విశాఖపట్నంలోని తరంగ్ నావల్ ఇన్ స్టిట్యూట్లో మిలాన్ గ్రామం (MILAN Village) ఏర్పాటు చేసి, అందులో భారతీయ హస్తకళలు, వంటకాలు, కళలను ప్రదర్శించారు.
  • రియల్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలోని INS జలశ్వ (L41)లో ముగింపు వేడుక జరిగింది.




1 comment:

  1. Please give information 1995 to 2024 Milan years

    ReplyDelete