- అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) అనే స్వచ్ఛంద సంస్థలు 'భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల ప్రస్తుత ముఖ్యమంత్రుల విశ్లేషణ 2023' పేరిట ఏప్రిల్ 12, 2023న నివేదిక విడుదల చేశాయి.
- ఈ నివేదికలో భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల ప్రస్తుత ముఖ్యమంత్రుల ఆస్తులు, అప్పులు, కేసులు మొదలైనవి ఉన్నాయి.
- ఈ ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు మరియు ఆ అఫిడవిట్లను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్ (www.eci.gov.in) నుండి పొందినట్టు ఆ సంస్థలు స్పష్టం చేశాయి.
- ఈ డేటాను చిత్తశుద్ధితో, ఓటర్లకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అందించబడిందని పేర్కొన్నాయి.
- Website: www.adrindia.org
- ADR Report 2023 Download PDF
ఆస్తులు (Assets):
- మొత్తం ముఖ్యమంత్రుల ఆస్తుల సగటు ⇒ రూ.33.96 కోట్లు
- 30 మంది ముఖ్యమంత్రులలో 29 మంది (97%) కోటీశ్వరులు.
- ఇందులో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (రూ.510.38 కోట్లు) నిలవగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (రూ.15 లక్షలు) ఆఖరి స్థానంలో ఉన్నారు.
ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు |
|||
Position | Chief Minister | State | Total Assets (₹) |
---|---|---|---|
1 | Y.S.Jagan Mohan Reddy | Andhra Pradesh | 5,10,38,16,566 (510 Crore+) |
2 | Pema Khandu | Arunachal Pradesh | 1,63,50,58,142 (163 Crore+) |
3 | Naveen Patnaik | Odisha | 63,87,41,816 (63 Crore+) |
6 | K.C.R | Telangana | 23,55,37,725 (23 Crore+) |
29 | Pinarayi Vijayan | Kerala | 1,18,75,766 (1 Crore+) |
30 | Mamata Banerjee | West Bengal | 15,38,029 (15 Lacs+) |
అప్పులు (Liabilities):
- 20 మంది ముఖ్యమంత్రులు తమకున్న అప్పులను పేర్కొన్నారు.
అత్యధిక అప్పులున్న ముఖ్యమంత్రులు (టాప్-3) |
|||
Position | Chief Minister | State | Total Liabilities (₹) |
---|---|---|---|
1 | K.C.R | Telangana | 8,88,47,570 (8 Crore+) |
2 | Basavaraj Bommai | Karnataka | 4,99,23,550 (4 Crore+) |
3 | Eknath Sambhaji Shinde | Maharashtra | 3,74,60,261 (3 Crore+) |
క్రిమినల్ కేసులు (Criminal Cases):
- 13 మంది (43%) ముఖ్యమంత్రులపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులు తదితర కేసులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రులు (టాప్-3) |
|||
Position | Chief Minister | State | No.of Criminal Cases |
---|---|---|---|
1 | K.C.R | Telangana | 64 |
2 | M.K. Stalin | Tamil Nadu | 47 |
3 | Y.S.Jagan Mohan Reddy | Andhra Pradesh | 38 |
ADR:
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనేది 1999లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) అహ్మదాబాద్ ప్రొఫెసర్ల బృందంచే స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ.
- 1999లో, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర, ఆర్థిక మరియు విద్యా నేపథ్యాన్ని బహిర్గతం చేయాలని అభ్యర్థిస్తూ వారు ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని ఆధారంగా 2002 మరియు 2003లో సుప్రీంకోర్టు తన తీర్పులో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందు నేర, ఆర్థిక, విద్యా నేపథ్యాన్ని వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది.
- 2002లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ADR మొదటి ఎన్నికల వీక్షణను నిర్వహించింది, దీని ద్వారా ఎన్నికల సమయంలో ఓటర్లు సరైన ఎంపిక చేసుకునేందుకు ఓటర్లకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేపథ్యాల యొక్క వివరణాత్మక విశ్లేషణ అందించబడింది.
- అప్పటి నుండి ఇది నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) సహకారంతో దాదాపు అన్ని రాష్ట్ర మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల వీక్షణను నిర్వహిస్తున్నది.
- దేశంలోని రాజకీయ మరియు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో ఇది బహుళ ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.
- Website: www.adrindia.org