Banner 160x300

What is Ramzan / Ramadan in Telugu | రంజాన్ ప్రాముఖ్యత


What is Ramzan Ramadhan in Telugu | రంజాన్ ప్రాముఖ్యత | Student Soula

రంజాన్ (Ramzan/ Ramadan):

  • పండుగ అనేది ఏ మతానికి సంబంధించినది అయినా సరే, దాని వెనుక ఒక సందేశం, ఒక శాస్త్రీయత, ఒక సదాచారం దాగి ఉంటాయి.
  • ముస్లీంలు చాంద్రమాన (ఇస్లామిక్/ హిజ్రీ) క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ లోని నెల/తేదీలు స్థానికంగా చంద్రోదయంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో తొమ్మిదవ నెల పేరు రంజాన్.
  • ఇస్లాం ధర్మంలో రంజాన్ మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ముస్లీంల పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించింది ఈ రంజాన్ మాసంలోనే.
  • నెలవంక (Crescent Moon) కనిపించిన తర్వాత స్థానిక మతాధిపతులు ఈ పండుగను ప్రకటిస్తారు.
  • అరబ్బీలో 'రమ్జ్' అంటే దగ్ధం కావడం అని అర్థం. మనసా వాచా కర్మేణా ఉపవాస దీక్షలు నిబద్ధతతో పాటించిన వారి పాపాలు కాలిపోతాయని ప్రతీతి.
  • పండుగ ప్రాముఖ్యం: రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్షతో మానవునిలో నిగ్రహణ శక్తి, ఆత్మ ప్రక్షాళనతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం సాగుతుందని నమ్మకం. ఓర్పు, పవిత్రత, సమయపాలన, దానశీలత, సామరస్యం, అనురాగం, మానవత్వం వంటి అంశాలపై దృష్టి కేంద్రీకృతమవుతుంది.
Ramadan100years1938-2037 | What is Ramzan Ramadhan in Telugu | రంజాన్ ప్రాముఖ్యత | Student Soula

ఉపవాసం (రోజా):

  • ఈ రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసం (Fasting).
  • ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అంటారు.
  • స్వర్గానికి ఎనిమిది ద్వారాలుంటాయని ముస్లీంల విశ్వాసం. వీటిలో ఒకదాని పేరు రయ్యాన్. ఉపవాసాలు పాటించిన వారికే ఈ ద్వారంలో ప్రవేశం లభిస్తుందనేది నమ్మకం.
  • 29/30 రోజుల ఉపవాస దీక్ష తమలోని దయార్ద్రతను చాటి మానవత్వ విలువల్ని వెలికి తీస్తుంది. 
  • సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు తీసుకునే ఆహార నియమాన్ని సహూర్ అంటారు.
  • సూర్యాస్తమయం తర్వాత ఖర్జూరపు పండుగాని, ఇతర ఫలాలను గాని తీసుకుని ఉపవాస దీక్షను విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు.
  • రోజాలో ఉండగా ఉమ్మిని మింగరాదు, బీడీ, సిగరేట్ లాంటివి కాల్చడం చేయరాదు. మద్యం సేవించరాదు, చాడీలు చెప్పుట, ఇతరులను దుర్భాషలాడడం, అబద్ధం చెప్పుట, చెడు పనులు చేయుట నిషిద్ధాలు.

నమాజ్:

  • రంజాన్ మాసంలో రోజా పాటిస్తూ, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తూ, మసీదులలో ఎక్కువ సమయం గడుపుతారు.
  • ఐదుసార్లు చేసే నమాజులు,
  1. ఫజర్ (సూర్యోదయమునకు పూర్వము)
  2. జూహర్ (మధ్యాహ్నం తర్వాత)
  3. అసర్ (సూర్యాస్తమయానికి పూర్వము)
  4. మగరీబ్ (సూర్యాస్తమయం వద్ద ప్రారంభమవుతుంది)
  5. ఇషా (అర్ధరాత్రి ముందు)
  • ఈ నెలలో రాత్రి చేయు ప్రత్యేక ప్రార్థనలను తరావీహ్ అంటారు.

దానధర్మాలు:

  • ఆస్తిలో (సంపాదనలో) నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు.
  • మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు, అభాగ్యులకు పండగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం బోధిస్తోంది.
  • దానం పాప పరిహారమని, పాప విముక్తికి మార్గంగా చెబుతారు.

హలీం:

  • రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది హలీం. ఎంతో బవవర్థకం, రుచికరం. ప్రత్యేక పొయ్యిపై గంటల తరబడి గోధుమలు, మాంసం, డ్రైఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలతో ఉడకపెట్టి దీన్ని తయారు చేస్తారు. 

ఈద్-ఉల్-ఫితర్:

  • ఇస్లామిక్ (హిజ్రీ) క్యాలెండర్‌లోని పదవ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.  ఇది రంజాన్ నెలకు ముగింపు రోజు.