WORLD DAY OF SOCIAL JUSTICEప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం****
ఉద్దేశ్యం:
- సామాజిక న్యాయ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) జరుపుకుంటారు.
ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు?
- 26 నవంబర్ 2007 న జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 62వ సెషన్ లో ఫిబ్రవరి 20 వ తేదీని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది.
- 2009 నుంచి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తేదీన ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (World Day of Social Justice) ను జరుపుకుంటున్నారు.
థీమ్ (Theme):
- 2023: Overcoming Barriers and Unleashing Opportunities for Social Justice.
- 2022: Achieving Social Justice through Formal Employment
సామాజిక న్యాయం (Social Justice):
- దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమన్యాయం జరగడం, దేశ వనరులు, సంపదపై ప్రజలందరికీ సమాన వాటాలు దక్కడమే సామాజిక న్యాయం (Social Justice).
- సామాజిక న్యాయం సుసాధ్యం కావడానికి పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, నిరుద్యోగాన్ని నిలువరించడం, సామాజిక భద్రత, ఆర్థిక అసమానతల తొలగింపు, జనాభా నియంత్రణ, నిరక్షరాస్యత నిర్మూలన లాంటి ముఖ్యమైన అంశాలు దోహదపడుతాయి.
- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఆర్థికంగా సమగ్రాభివృద్ధి చెందినప్పుడు మాత్రమే శాంతియుత సమాజం, సామాజిక న్యాయం వికసిస్తుంది.
రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ లో డా.బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ స్పూర్తిని అంతర్లీనం చేశారు. వాటిలో కొన్ని,
- ప్రవేశిక: ప్రజలందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని తెలుపుతోంది.
- ఆర్టికల్ 38: ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి.
- ఆర్టికల్ 38(1): ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వాలు పాటుపడాలి. రాజ్యం స్థాపించే సంస్థలు, వ్యవస్థ ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చే సాధనాలుగా ఉండాలి.
- ఆర్టికల్ 17: సామాజికంగా అందరూ సమానం అని చెబుతూ, అంటరానితనాన్ని (Untouchability) నిషేధించింది.
- ఆర్టికల్ 325: మతం, కులం, జాతి, లింగ ప్రాతిపదికపై ఏ పౌరునికి ఓటు హక్కు నిరాకరించరాదు. అలాగే ప్రత్యేక గుర్తింపు ఇవ్వరాదు.
వీటిని కూడా చూడండీ: