KCR BIOGRAPHY
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర
****
- పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)
- జననం: 17 ఫిబ్రవరి 1954
- జన్మస్థలం: చింతమడక, సిద్దిపేట జిల్లా, తెలంగాణ.
- తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు
- భార్య: శోభ (వివాహం: 1969 ఏప్రిల్ 23)
- పిల్లలు: కల్వకుంట్ల తారక రామారావు (KTR), కల్వకుంట్ల కవిత.
- చదువు: సిద్దిపేట డిగ్రీ కళాశాల నుంచి B.A, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (తెలుగు సాహిత్యం).
- 1970: మెదక్ జిల్లాలో (ఇప్పటి సిద్దిపేట జిల్లా) కాంగ్రెస్ యువ నాయకుడిగా రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.
- 1982: తెలుగుదేశం పార్టీలో చేరాడు.
- 1983: తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
- 1985: తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.
- 1987-88: తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో Minister of Drought & Relief గా పనిచేశారు.
- 1989: తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.
- 1992-93: పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ పదవిని నిర్వహించారు.
- 1994: తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు.
- 1997-99: తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవిని నిర్వహించారు.
- 1999: తెలుగుదేశం పార్టీ తరపున సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు. కానీ చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో KCR కు స్థానం కల్పించకుండ తప్పించడం KCR ను అసంతృప్తుణ్ణి చేసింది.
- 1999-2001: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ పదవిని నిర్వహించారు.
- 2001 ఏప్రిల్ 27: తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2001 లో కొత్తగా ఉత్తరఖండ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమి అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరచింది.
- 2001 మే 17: తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించారు.
- 2004: సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి MLA గాను, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి MP గాను గెలుపొందారు. ఐదుగురు లోకసభ సభ్యులున్న తెరాస, కాంగ్రెస్ నేపధ్యంలోని UPA కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది.
- 2004-06: కేంద్ర రేవులు, నౌకాయానం, జలరవాణ శాఖ మంత్రిగా (22 మే 2004 - 25 మే 2004), కేంద్ర కార్మిక, ఉపాది శాఖ మంత్రిగా (27 నవంబర్ 2004 - 24 ఆగస్ట్ 2006) పనిచేశారు.
- 2006 సెప్టెంబర్ 12: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, UPA నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మంత్రిపదవులతో పాటు లోకసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.
- 2006 డిసెంబర్ 7: ఉప ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుండి మళ్ళీ పోటీ చేసి MP గా ఎన్నికయ్యారు.
- 2008: మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ లోకసభ స్థానం నుండి పోటి చేసి విజయం సాధించాడు.
- 2009: 15వ లోకసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుండి పోటి చేసి విజయం సాధించాడు.
- 2009 నవంబర్ 29: తెలంగాణ ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు.
- 2009 డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగించే విధంగా కేంద్ర హోం మంత్రి చిదంబరం రాత్రి 11.30 గంటలకు ప్రకటన జారీ చేశారు. ఆ వెంటనే KCR నిరాహార దీక్ష విరమించారు. (11 రోజుల తర్వాత)
- 2014 మే 16: గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుండి MLA గా, మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి MP గా గెలుపొందారు.
- 2014 జూన్ 2: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
- 2018 సెప్టెంబర్: తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు.
- 2018 డిసెంబర్ 7: గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుండి MLA గా గెలుపొందారు.
- 2018 డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు.
KCR గారి భార్య: శోభ, కొడుకు: కల్వకుంట్ల తారక రామారావు (KTR), కూతురు: కల్వకుంట్ల కవిత |
కాలం కడుపుతో కన్న కారణజన్ముడు
— KMR@KTR (@kmr_ktr) February 16, 2023
తల్లినే సృష్టించిన తనయుడు
భారతావని భవిష్యత్తు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
1 day to go#deshkinethaKcr #HappyBirthdayKCR #kcr #kcrforindia pic.twitter.com/9U9EkMgh3T