VALENTINE'S DAY
ప్రేమికుల దినోత్సవం
****
- ఒకే రోజు ప్రపంచం మొత్తం ఒక విషయం గురించి మాట్లాడాలనీ, దాన్నీ సెలెబ్రేట్ చేసుకోవాలనీ, దాన్నీ గురించి అవగాహన తీసుకురావాలనీ... ఇలా కొన్ని ఉద్దేశాలతో ప్రత్యేక దినోత్సవాలను (Special Days) జరుపుకుంటాం.
- గుడిలో రోజు పూజలు చేస్తారు... పండగలప్పుడు ఇంకొద్దిగా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అదే విదంగా... మనకు ఇష్టమైన వాళ్ళను మనం రోజు ప్రేమిస్తున్నా...ఈ ప్రేమను Special గా Celebrate చేసుకోవడానికీ ఒక రోజంటూ ఉండాలీ... అదే ఈ వాలెంటైన్స్ డే. ప్రేమికులకు ఉన్న ఒకే ఒక పెద్ద పండగ ఈ వాలెంటైన్స్ డే.
- అసలు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరమా? ప్రేమకు డేట్స్, డెడ్‌లైన్స్ ఉంటాయా? అనంతమైన ప్రేమను ఏడాదంతా వ్యక్తం చేసినా సమయం చాలదు కదా? అనేవాళ్లు ఉంటారు. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ రోజును కేటాయిస్తే తప్పేముంది అనేవాళ్లూ ఉన్నారు. సో... వాలెంటైన్స్ డే చుట్టూ జరిగే చర్చ కూడా ప్రేమలా అనంతమైనది. శాశ్వతమైనది.
ప్రేమికుల దినోత్సవం చరిత్ర:
- రోమ్ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 268 నుండి 270 వరకు క్లాడియస్-2 అనే చక్రవర్తి పరిపాలించేవాడు.
- పెళ్ళీ అయినవారికంటే కానివారే బలంగా, ఎనర్జీటిక్ గా ఉండి, యుద్దంలో దైర్యంగా పోరాడుతారని, పెళ్ళి అయినవారు యుద్ద సమయంలో భార్య పిల్లలను తలచుకుని, యుద్దంలో వెనకడుగు వేస్తారనే ఉద్దేశ్యంతో అతను తన సైన్యంలోని సైనికులెవ్వరు పెళ్ళిచేసుకోకూడదనే నియమం పెట్టాడు.
- సైనికులకు ఈ నియమం ఇష్టంలేకపోయినా, కష్టంగానే పాటించేవారు.
- Saint Valentine అనే క్రైస్తవ మతాధికారికి కూడా ఈ నియమం నచ్చలేదు. ఇతను యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. ఇతను రాజుకు తెలియకుండా సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు కూడా చేసేవాడు.
- రాజుకు ఈ విషయం తెలిసింది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారుచేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వాలెంటైన్‌కి ఉరిశిక్ష విధించాడు. ఉరిశిక్ష అమలుచేయడానికి ముందు కొన్ని రోజులు జైలులో ఉంచాడు.
- కళ్ళులేని జైలు అధికారి కూతురితో Saint Valentine కు జైలులో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగ మారింది.
- Saint Valentine తన ప్రార్థనల ద్వార ఆ అమ్మాయికి కళ్ళు వచ్చేలా చేశాడు.
- ఉరిశిక్ష అమలయ్యే ముందురోజు Saint Valentine ఆ అమ్మాయికి ఒక ఉత్తరం రాశి, దాని చివర ‘From Your Valentine’ అని రాసి ఇస్తాడు.
- ఆ తరువాత రోజు అంటే, క్రీ.శ.269 ఫిబ్రవరీ 14 న Saint Valentine ను ఉరితీయడం జరిగింది.
- ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా, ఆనందంగా మారుతుందని యువతీ యువకులకు ప్రేమోపదేశాలు చేసి, రోమ్ చక్రవర్తికీ వ్యతిరేకంగా ప్రేమ వివాహాలను ప్రోత్సహించిన వాలెంటైన్ మరణించిన రెండు శతాబ్దాల తర్వాత క్రీ.శ. 496లో అప్పటి పోప్ గెలాసియస్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు.
- ఇది నిజం అని చెప్పడానికి బలమైన చారిత్రక ఆధారాలు ఏవీ లేవు. నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు కానీ, ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యంలో ఉన్న, చాలా మంది నమ్మే కథ.
Valentine's Week:
(1) Rose Day - February 07
తెల్ల గులాబి → దైవ ప్రేమ
పసుపు గులాబి → స్నేహం
పింక్ గులాబి → వాగ్దానం/శృంగార భావాలు
(2) Propose Day - February 08
(3) Chocolate Day - February 09
(4) Teddy Day - February 10
(5) Promise Day - February 11
(6) Hug Day - February 12
(7) Kiss Day - February 13