Saturday, February 1, 2020

భారత కేంద్ర బడ్జెట్ యొక్క పూర్తి చరిత్ర | Complete History of Union Budget of India In Telugu

Complete History of Union Budget of India In Telugu | భారత కేంద్ర బడ్జెట్ యొక్క పూర్తి చరిత్ర
History of Union Budget of India
బడ్జెట్

బడ్జెట్ అంటే?
  • బడ్జెట్ అనే మాట బొగెట్టీ (Bougette) అనే ఫ్రెంచి పదం నుంచి ఆవిర్భవించింది.
  • బొగెట్టీ అంటే తోలు సంచి అని అర్థం. పూర్వం ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లెక్కల పత్రాల్ని సభకు తోలు సంచిలో తీసుకువచ్చేవారు . కాబట్టీ ఈ మాట వాడుకలోకి వచ్చింది. 
  • వార్షిక సంవత్సరంలో రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్చుల గురించి తెలియజేసే ఆర్థిక నివేదికను బడ్జెట్ అంటారు. 
  • భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 112 లో వార్షిక బడ్జెట్ ను  వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం లోకసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతారు. దీనికి ఒకరోజు ముుందుగా ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.
  • బడ్జెట్  ఏప్రిల్ 01 వ తేదీ నుండి అమలులోనికి వస్తుంది. కారణం ఏప్రిల్ 01 అనేది ఆర్థిక సంవత్సర ప్రారంభ రోజు. దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 01 న ప్రారంభమై మార్చి 31 న ముగుస్తుంది.

బడ్జెట్ ఎందుకు?
బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. బడ్జెట్ లో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని చేరుకోవడానికి కేటాయింపులు కూడా చేస్తారు. దీంతో ఎంత ఆదాయం వస్తోంది? ఎంత ఖర్చు పెడుతున్నాం? వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి గందరగోళం ఉండదు. ఇంకా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించొచ్చు.

బడ్జెట్ పరిమాణం:
  • మొదటి బడ్జెట్ (1947) లో ఆదాయం రూ 171.15 కోట్లు, వ్యయం రూ 197.39 కోట్లుగా అంచనా వేశారు. నికర లోటు 26.24 కోట్లు.
  • 2016-17: బడ్జెట్ రూ.19,75,194/- కోట్లు
  • 2017-18: బడ్జెట్ రూ.21,46,735/- కోట్లు
  • 2018-19: బడ్జెట్ రూ.24,42,213/- కోట్లు
  • 2019-20: బడ్జెట్ రూ.27,86,349/- కోట్లు
  • 2020-21: బడ్జెట్ రూ.30,42,230/- కోట్లు

బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయం:
  • బ్రిటీష్ వారు మనదేశ బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు.
ఎందుకంటే మన దేశ కాలమానానికి బ్రిటీష్ కాలమానానికి ఐదున్నర గంటల తేడా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ వివరాలను మరునాడు ఉదయాన్నే బ్రిటన్ కు చేరవేయడానికి వీలుగా వారు ఈ సమయాన్ని ఎంచుకున్నారు.
  • ఈ సంప్రదాయానికి స్వస్తిపలికి 2000 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌ ను అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి ఇదే పద్ధతిని పాటిస్తున్నాము.
  • ఇంతకు ముందు బడ్జెట్ ను ఫిబ్రవరీ చివరి రోజున ప్రవేశపెట్టేవారు. కానీ 2017 నుంచి ఫిబ్రవరీ 01 వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

సాధారణ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్:
  • 1921 లో సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ను వేరుచేయడానికి అక్ వర్త్ కమిటీని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీ సిఫార్సుల మేరకు 1924 నుండి రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు.
  • 2017 నుంచి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కలిపి ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ పేపర్స్ లీక్:
  • బడ్జెట్ పేపర్స్ లీకైన సంఘటన 1950 లో చోటు చేసుకుంది.
  • అప్పట్లో బడ్జెట్ పత్రాల్ని రాష్ట్రపతి భవన్ లో ముద్రించేవారు. 1950 లో ఈ పత్రాలు లీక్ కావడంతో అప్పట్నుంచి  మింటో రోడ్ లోని సెక్యూరిటీ ప్రెస్ కు ముద్రణ వేదికను మార్చారు.
  • 1980 నుంచి ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో బడ్జెట్ పత్రాల్ని ముద్రిస్తున్నారు.

బడ్జెట్ లో రకాలు:
  • ఆదాయ, వ్యయాల మధ్యగల సంబంధాన్ని బట్టి బడ్జెట్ రెండు రకాలు:
(1) సంతులిత బడ్జెట్: రాబోయే ఆదాయం, చేయబోయే ఖర్పులు సమానంగా ఉన్నట్లయితే దానిని సంతులిత బడ్జెట్ అంటారు.
(2) అసంతులిత బడ్జెట్: ఆదాయ, వ్యయాల మధ్య అసమానతలు ఉన్న బడ్జెట్ ను అసంతులిత బడ్జెట్ అంటారు. అసంతులిత బడ్జెట్ రెండు రకాలు: 
(అ) మిగులు బడ్జెట్: రాబోయే ఆదాయం ఎక్కువగా ఉండి, చేయబోయే ఖర్చులు తక్కువగా ఉన్నట్లయితే దానిని మిగులు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ ను ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు.
(ఆ) లోటు బడ్జెట్: రాబోయే ఆదాయం తక్కువగా ఉండి, చేయబోయే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే దానిని లోటు బడ్జెట్ అంటారు. ఈ తరహా బడ్జెట్ ను ఆర్థిక మాంద్యంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో అనుసరిస్తారు. లోటు బడ్జెట్ 5 రకాలు: 
(A) రెవెన్యు లోటు: రెవెన్యు ఆదాయం తక్కువ, రెవెన్యు వ్యయం ఎక్కువ 
(B) మూలధన లోటు: మూలధన ఆదాయం తక్కువ, మూలధన వ్యయం ఎక్కువ 
(C) బడ్జెట్ లోటు: మొత్తం ఆదాయం తక్కువ, మొత్తం వ్యయం ఎక్కువ 
(D) కోష లోటు: బడ్జెట్ లోటు మరియు ఇతర అప్పుల మొత్తం.
కోష లోటునే ద్రవ్య లోటు, విత్త లోటు, ఫిసిక్కల్ లోటు అంటారు. 
(E) ప్రాథమిక లోటు: కోష లోటు నుండి వడ్బి చెల్లింపులను తీసివేయగా మిగిలిన దానిని ప్రాధమిక లోటు ఉంటారు.

బడ్జెట్ లో ప్రభుత్వం చేసే ఖర్చును రెండు రకాలుగా వర్గీకరించారు.
(1) ప్రణాళికా వ్యయం:
  • ప్రణాళికలో పేర్కొన్న సాధారణ పరిపాలన నిమిత్తం చేసే ఖర్చును ప్రణాళికా వ్యయం అంటారు.
ఇది రెండు రకాలు: (A) రెవెన్యు వ్యయం (B) మూలధన వ్యయం
(2) ప్రణాళికేతర వ్యయం:
  • మూలధన ఆస్తులను సమకూర్చుకోవడానికై చేసే ఖర్చును ప్రణాళికలో ప్రస్తావించకుండా చేసే ఖర్చును ప్రణాళికేతర వ్యయం అంటారు.
ఇది రెండు రకాలు: 
(A) రెవెన్యు వ్యయం: రెవెన్యు ఖాతాలపై చేయబడిన ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల మొత్తం. 
(B) మూలధన వ్యయం: మూలధన ఖాతాలపై చేయబడిన ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాల మొత్తం.

ఆర్థికమంత్రులు - ప్రత్యేకతలు:
  • ఆర్.కె.షణ్ముగం చెట్టి: స్వాతంత్ర్యా నంతరం తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి. ప్రణాళిక సంఘం ఏర్పాటు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • జాన్ మథాయ్: 1950 లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రి. పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి వచ్చాయి.
  • సీడీ దేశముఖ్: దేశంలో తొలిసారి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
  • T.T.కృష్ణమచారి: సంపద పన్నును ప్రవేశపెట్టడం, స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం ప్రారంభం, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఏర్పాటు.
  • జవహర్ లాల్ నెహ్రూ: బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని (1958). గిఫ్ట్ ట్యాక్స్ ప్రతిపాదన.
  • మొరార్జీ దేశాయ్: ప్రజా కోణంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎక్కువ సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పి హరిత విప్లవానికి నాంది పలికాడు. బంగారంపై నియంత్రణ కొసం గోల్డ్ యాక్ట్ ను తీసుకొని వచ్చాడు. తన పుట్టిన రోజున (ఫిబ్రవరి 29) 1964, 1968 న బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
  • ఇందిరా గాంధీ: బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. పాల దిగుబడిని పెంచడానికి శ్వేత విప్లవానికి నాంది పలికారు.
  • వైబీ చవాన్: భీమా, బొగ్గు కంపెనీలను జాతీయం చేయడానికి రూ. 56 కోట్లు కేటాయించారు. రూ. 550 కోట్లు లోటు ఏర్పడటంతో  ఈ బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్ అంటారు.
  • సి.సుబ్రహ్మణ్యం: ESI, EPAF, కుటుంబ పథకాలను ప్రారంభించారు.
  • HM.పటేల్: ఆర్థికమంత్రి పదవిని చేపట్టిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి
  • సి.చరణ్ సింగ్: వినియోగదారుల వస్తువులపై ఎక్సైజ్ డ్యూటీ విధించారు.
  • HN.బహుగుణ: బడ్జెట్ ను ప్రవేశపెట్టని ఆర్థికమంత్రి.
  • ప్రణబ్ ముఖర్జీ (1982): NRI ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టారు.
  • రాజీవ్ గాంధీ (1987): ఈయన ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గాంధీ బడ్జెట్ అంటారు. కనీస వాణిజ్య పన్ను (మ్యాట్ ), కార్పొరేషన్ పన్ను ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీంతో తొలిసారిగా ప్రభుత్వ ఆదాయం పెరిగింది.
  • మధు దండవతే: CEBI ఏర్పాటు. బడ్జెట్ పై అత్యధిక సమయం మాట్లాడిన ఆర్థికమంత్రి.
  • మన్మోహన్ సింగ్: లైసెన్స్ రాజ్ కు చరమ గీతం పాడారు. లిబరైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి నూతన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఎగుమతి, దిగుమతి విధానాల్లో భారీ మార్పు, కస్టమ్స్ సుంకాలను 220 నుంచి 150 శాతానికి తగ్గించి దేశాభివృద్ధికి తోడ్పడ్డారు.
  • చిదంబరం: డ్రీమ్ బడ్జెట్ ను, తొలిసారిగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నల్లధనం వెలికి తీతకు ఆస్తుల స్వియ ప్రకటన పథకం ప్రవేశపెట్టారు. ఆదాయ పన్ను రేటును తగ్గించడంవల్ల పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగి ఆదాయం పెరిగింది.
  • యశ్వంత్ సిన్హా: 1999 - 2000 వరకు సాయంత్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విధానానికి స్వస్తి పలిక, ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే విధానాన్ని ప్రారంభించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లను ప్రతిపాదించారు.
  • జశ్వంత్ సింగ్: అతి తక్కువ కాలం (13 రోజులు) పనిచేసిన ఆర్థికమంత్రి.  ఎలక్ట్రానిక్ విధానంలో ఆదాయపన్ను వివరాలను నమోదు చేసే విధానానికి స్వీకారం చుట్టారు.
  • అరుణ్ జైట్లీ: సంప్రదాయానికి భిన్నంగా ఫిబ్రవరి 01 (2018) న  బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం ప్రస్తావన లేకపోవడం, హిందీలో ప్రసంగించడం, 92 ఏండ్ల తర్వాత రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో  కలిపి ప్రవేశపెట్టారు. డిజిటల్ విధానాన్ని ప్రోత్సాహించారు.

మరికొన్ని ముఖ్యమైన అంశాలు:
  • బ్రిటీష్ వారి హయంలో ఇండియన్ కౌన్సిల్ ఆర్థిక సభ్యుడు జేమ్స్ విల్సన్ 7 ఏప్రిల్ 1860 న తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. 
  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రి ఆర్. కె. షణ్ముంగమ్ చెట్టి 1947 నవంబర్ 26 న మొదటి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టాడు.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తొలి బడ్జెట్‌ ను జాన్ మథాయ్ 1950 ఫిబ్రవరి 28 న ప్రవేశపెట్టాడు.
  • ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రులు - జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ
  • ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రధాన మంత్రులైనవారు - మన్మోహన్ సింగ్, వీపీ సింగ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్.
  • ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి మహిళా - ఇందిరా గాంధి
  • ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రెండవ మహిళా మరియు సంపూర్ణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మొదటి మహిళా - నిర్మల సీతారామన్
  • రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆర్థిక మంత్రి అయిన మొదటి వ్యక్తి - ప్రణబ్ ముఖర్జీ
  • రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసి, ఆర్థిక మంత్రిగా పనిచేసినవారు - మన్మోహన్ సింగ్, సీడీ దేశ్ ముఖ్
  • 1991 లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్, ప్రతుల పరంగా అతి పెద్దది. ఈ బడ్జెట్ లో 18520 పదాలు ఉన్నాయి.
  • 1952 లో సీడీ దేశముఖ్ ప్రవేశపెట్టిన బడ్జెట్, ప్రతుల పరంగా అతి చిన్నది. ఈ బడ్జెట్ లో కేవలం 4454 పదాలు ఉన్నాయి.
  • అత్యధికంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది - మొరార్జీ దేశాయ్ (10 సార్లు), చిదంబరం (9 సార్లు), ప్రణబ్ ముఖర్జీ (8 సార్లు)
  • సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసింది - మధు దండావతే (133 నిమిషాలు)
  • ఇండియాలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం కర్ణాటక



No comments:

Post a Comment