Home

History of National Productivity Day in Telugu | జాతీయ ఉత్పాదకత దినోత్సవం - ఫిబ్రవరి 12

History of National Productivity Day in Telugu | జాతీయ ఉత్పాదకత దినోత్సవం - ఫిబ్రవరి 12 | Student Soula Tags: National Productivity Day in telugu, National Productivity Day essay in telugu, History of National Productivity Day in telugu, about National Productivity Day in telugu, theme of National Productivity Day 2023 in telugu, jathiya uthpadaka dinotsavam, Day Celebrations, Days Special, What today special, today special, today history, Days, Important days, important days in telugu, important days in January, important days in February, important days in  March, important days in  April, important days in May, important days in  June, important days in  July, important days in August, important days in September, important days in October, important days in November, important days in December, special in February, days celebrations in February, popular days in February, February lo dinostavalu, special in February 12, Student Soula,

NATIONAL PRODUCTIVITY DAY
జాతీయ ఉత్పాదకత దినోత్సవం
****

ఉద్దేశ్యం:
  • ఉత్పాదకత (Productivity), సామర్థ్యం (Efficiency) మరియు ఆవిష్కరణ (Innovation) యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం జాతీయ ఉత్పాదకత దినోత్సవం (National Productivity Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఎప్పుడు జరుపుకుంటున్నారు?
  • ఫిబ్రవరి 12 న భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని (National Productivity Day) జరుపుకుంటారు. అంతేకాకుండా, ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 12 నుండి 18 వరకు దేశవ్యాప్తంగా జాతీయ ఉత్పాదకత వారం (National Productivity Week) గా జరుపుకుంటారు.
  • భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో నాణ్యత, సామర్థ్యం, పోటీతత్వాన్ని మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం జాతీయ ఉత్పాదకత దినోత్సవం మరియు జాతీయ ఉత్పాదకత వారోత్సవాల ముఖ్య లక్ష్యం.

ఫిబ్రవరి 12 నే ఎందుకు?
  • 1958 ఫిబ్రవరి 12 న  న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా జాతీయ ఉత్పాదకత మండలి (NPC-National Productivity Council) స్థాపించబడింది. దీనికి గుర్తుగా ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 12 న జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జరుపుకుంటారు.

థీమ్ (Theme):
  • 2023: Productivity, Green Growth and Sustainability: Celebrating India’s G20 Presidency
  • 2022: Self-Reliance Through Productivity

ఉత్పాదకత (Productivity):
  • ఉత్పాదకత అనేది అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయడానికి వనరులు ఎంత బాగా ఉపయోగించబడుతున్నాయి అనే దానికి కొలమానం.
  • ఉత్పాదకత = అవుట్‌పుట్/ఇన్‌పుట్
  • అవుట్‌పుట్‌ (వస్తువులు మరియు సేవలు) & ఇన్‌పుట్‌ (మూలధనం, శ్రమ, పదార్థాలు, శక్తి, మరియు ఇతర వనరులు)


జాతీయ ఉత్పాదకత మండలి (National Productivity Council):
  • 1958 ఫిబ్రవరి 12 న  న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా స్థాపించబడింది.
  • ఇది Societies Registration Act XXI of 1860 క్రింద నమోదు చేయబడింది. 
  • ఇది భారతదేశంలో ఉత్పాదకత సంస్కృతిని ప్రోత్సహించడానికి Department for Promotion of Industry & Internal Trade, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తున్న ఒక స్వయంప్రతిపత్తి సంస్థ.
  • ఇది ఉత్పాదకతను పెంపొందించడం ద్వారా దేశం యొక్క స్థిరమైన, సమ్మిళిత సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • ఇది ఉత్పదకత రంగంలో పరిశోధన చేపట్టడమే కాకుండా, పారిశ్రామిక ఇంజనీరింగ్, అగ్రి-బిజినెస్, ఎకనామిక్ సర్వీసెస్, క్వాలిటీ మేనేజ్ మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ మేనేజ్ మెంట్, ఎనర్జీ మేనేజ్ మెంట్, ఎన్విరాన్ మెంటల్ మేనేజ్ మెంట్ మొదలైన ప్రభుత్వ, పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు కన్సల్టెన్సీ మరియు శిక్షణ సేవలను అందిస్తోంది.
  • ఇది 1961లో టోక్యో కేంద్రంగా ఏర్పాటైన ఆసియా ఉత్పాదకత సంస్థ (APO-Asian Productivity Organisation) యొక్క అంతర్ ప్రభుత్వ సంస్థ (Inter-Governmental Body). APO లో భారత ప్రభుత్వం వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.
  • National Productivity Council (Official Website)
  • Asian Productivity Organisation (Official Website)

ఇతర ముఖ్యమైన అంశాలు:
  • ప్రపంచ ఉత్పాదకత దినోత్సవం (World Productivity Day) ను జూన్ 20 వ తేదీన జరుపుకుంటారు.

వీటిని కూడా చూడండీ: