Darwin Day |
డార్విన్
దినోత్సవం - ఫిబ్రవరి 12
లక్ష్యం:
చార్లెస్ డార్విన్ యొక్క శాస్త్రీయ ఆలోచన, క్రొత్త విషయాలను కనుగొనే ఉత్సుకత, సత్యం కోసం అన్వేషణ మొదలైన వాటి గురించి ప్రజలకు అవగాహన కలిగించి వారిని ప్రేరేపించడానికి డార్విన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఫిబ్రవరి 12 నే ఎందుకు?
చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12 న జన్మించాడు. ఆయన జన్మదినం అయిన ఫిబ్రవరి 12 కు గుర్తుగా ప్రతీ సంవత్సరం డార్విన్ దినోత్సవాన్ని (Darwin Day) జరుపుకుంటారు. దీనిని అంతర్జాతీయ డార్విన్ దినోత్సవం అని కూడ అంటారు.
డార్విన్ డే ప్రారంభం:
- అంతర్జాతీయ డార్విన్ డే వేడుకను స్థాపించడానికి వ్యవస్థీకృత ఉద్యమం ముగ్గురు డార్విన్ ఔత్సాహికులతో ప్రారంభమైంది:
- డాక్టర్ రాబర్ట్ స్టీఫెన్స్ (Dr.Robert Stephens) సిలికాన్ వ్యాలీలోని హ్యూమనిస్ట్ సమాజాన్ని 1995 లో వార్షిక డార్విన్ డే వేడుకను ప్రారంభించడానికి ప్రేరేపించారు.
- ప్రొఫెసర్ మాస్సిమో పిగ్లియుచి (Prof. Massimo Pigliucci) 1997 లో టేనస్సీ విశ్వవిద్యాలయంలో వార్షిక డార్విన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
- 2000 లో న్యూ మెక్సికోలో డార్విన్ డే కార్యక్రమాన్ని అధికారికంగా చేర్చడానికి డాక్టర్ రాబర్ట్ స్టీఫెన్స్ తో అమండా చెస్వర్త్ (Amanda Chesworth) కలిసి పనిచేశాడు.
- 2015 లో ఫిబ్రవరి 12 ను అమెరిక దేశం డార్విన్ డేగా ప్రకటించింది.
*డార్విన్ గురించి*
ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయముపై పరిశోధనలు చేసి, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం (Darwin's Theory Of Evolution) ను ప్రతిపాదించాడు.
- పేరు: డార్విన్
- పూర్తి పేరు: చార్లెస్ రాబర్ట్ డార్విన్ (Charles Robert Darwin)
- జననం: 1809 ఫిబ్రవరి 12
- జన్మస్థలం: ఇంగ్లాండ్‌లోని ష్రూస్‌బరీ (Shrewsbury, England)
- తల్లిదండ్రులు: సుసన్నా డార్విన్ మరియు రాబర్ట్ డార్విన్
- భార్య: ఎమ్మా వెడ్జ్‌వుడ్ (Emma Wedgwood)
- మరణం: 1882 ఏప్రిల్ 19 (England)
- రచనలు: The Voyage of the Beagle (1839), On the Origin of Species (1859), The Descent of Man (1871)
- అవార్డులు: FRS (1839), Royal Medal (1853), Wollaston Medal (1859), Copley Medal (1864), Doctor of Laws (Honorary), Cambridge (1877)
Charles Robert Darwin |