Savitribai Phule Biography In Telugu | సావిత్రిబాయి ఫులే జీవిత చరిత్ర |
Savitribai Phule Biography
సావిత్రిబాయి ఫులే జీవిత చరిత్ర
సావిత్రిబాయి ఫులే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఫులే దంపతులు వీరి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు.
- పేరు: సావిత్రి బాయి ఫులే (Savitribai Phule)
- జననం: 1831 జనవరి 03
- జన్మస్థలం: మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకా నయాగావ్ గ్రామం. ఇది పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- తల్లిదండ్రులు: లక్ష్మి మరియు ఖండోజీ నెవేషే పాటిల్
- పెళ్ళి: ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫులేను 1840 లో వివాహమాడింది.
- పిల్లలు: స్వంత పిల్లలు లేరు. కానీ 1874 లో యశ్వంతరావును దత్తత తీసుకున్నారు. ఇతను ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడు.
- చదువు: నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫులే మొదటి గురువు. జ్యోతీరావు ఫులే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది.
- 1848: పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది.
- 1849: జ్యోతిరావు ఫులే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు.
- 1852: మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి మహిళా సేవామండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది.
- 1854: ఆమె తన కవితా సంపుటి కావ్యఫూలే ను ప్రచురించింది.
- 1860: వితతంతువులకు శిరోముండనం చేయవద్దని క్షురకులను చైతన్య పరిచి వారితో ఉద్యమం చేయించి విజయం సాధించారు.
- 1868: అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.
- 1873: తన భర్తతో కలిసి "సత్యశోధక సమాజం" ను స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సతీసహగమనం రూపుమాపడం, వితతంతు పునర్వివాహం కోసం శ్రమించారు.
- 1873: డిసెంబర్ 25 న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో వివాహం జరిపించారు.
- 1890: నవంబర్ 28 న భర్త మరణించడంతో తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.
- 1891: పావన కాశీసుబోధ్ రత్నాకర్ అనే మరో కావ్యాన్ని రాశారు.
- 1897: మార్చి 10 న ప్లేగు వ్యాధితో మరణించారు.
- 1998: భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది.
- 2014: ఆగస్ట్ 09 వ తేదీన పూనే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు. (Savitribai Phule Pune University)
జ్యోతిరావు ఫులే - సావిత్రీ బాయి ఫులే |
మరికొన్ని అంశాలు:
- సావిత్రి బాయి ఫులే పుట్టిన రోజైన జనవరి 03 ను జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
- భారతదేశపు మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు - ఫాతిమా షేక్ (9 జనవరి 1831 - 9 అక్టోబర్ 1900) ఈమె పూణేలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలలో ఫాతిమా షేక్ పై పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది.
- ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1994 వ సంవత్సరం నుండి అక్టోబరు 5వ తేదిన జరుపుకుంటున్నారు.
- జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని 1962 వ సంవత్సరం నుండి సెప్టంబర్ 05 వ తేదిన జరుపుకుంటున్నారు.
- గురువులను ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ (Guru Purnima) అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున (June - July) గురుపూర్ణిమ జరుపుకుంటారు.
వీటిని కూడా చూడండీ:
- జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం (National Women Teachers Day)
- ముఖ్యమైన దినోత్సవాలు (Important Days)