దీనిని PDF Format లో Download చేసుకోవడానికి ఇక్కడ Click చేయండి.
కేంద్ర సాయుధ పోలీసు దళాలు
(CAPF- Central Armed Police Forces):
సరిహద్దు భద్రతా దళం (BSF- Border Security Force):
ర్యాంకులు:
సరిహద్దు భద్రతా దళం యొక్క చిహ్నం:
చరిత్ర:
వాఘా బార్డర్ వేడుక:
కేంద్ర సాయుధ పోలీసు దళాలు
(CAPF- Central Armed Police Forces):
(1) Border Security Force (BSF)
(2) Central Reserve Police Force (CRPF)
(3) Central Industrial Security Force (CISF)
(4) Indo-Tibetan Border Police (ITBP)
(5) Sashastra Seema Bal (SSB)
సరిహద్దు భద్రతా దళం (BSF- Border Security Force):
- భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రత, సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించడం, సరిహద్దు ప్రాంతాల్లో హింసను తగ్గించడం మరియు స్మగ్లింగ్, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం స్థాపించారు.
- విస్తారమైన ఎయిర్ వింగ్, మెరైన్ వింగ్, ఆర్టిలరీ రెజిమెంట్స్ మరియు కమాండో యూనిట్లు ఉన్నాయి.
- ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు కాపలా సంస్థ. బిఎస్‌ఎఫ్‌ను భారత భూభాగాలకు రక్షణ రేఖగా పిలుస్తారు.
- స్థాపన - 1965 డిసెంబర్ 01
- దీని ప్రధాన కార్యాలయం - న్యూడిల్లీ
- నినాదం (Motto) - జీవన్ పర్యంత్ కర్తవ్య (Duty Unto Death)
- సిబ్బంది - 186 బెటాలియన్లలో మొత్తం 257363 మంది
- ఇది హోం మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ.
- BSF తొలి డైరెక్టర్ జనరల్ - కే.ఎఫ్.రుస్తంజి (21 జూలై 1965 - 30 సెప్టెంబర్ 1974)
- BSF ప్రస్తుత డైరెక్టర్ జనరల్ - వికె జోహ్రీ (1 సెప్టెంబర్ 2019 నుంచి)
ర్యాంకులు:
- డైరెక్టర్ జనరల్
- స్పెషల్ డైరెక్టర్ జనరల్అ
- అదనపు డైరెక్టర్ జనరల్
- ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి)
- డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి)
- కమాండెంట్
- సెకండ్-ఇన్-కమాండ్
- డిప్యూటీ కమాండెంట్
- అసిస్టెంట్ కమాండెంట్ (3 నక్షత్రాలు)
- అసిస్టెంట్ కమాండెంట్ (2 నక్షత్రాలు)
సరిహద్దు భద్రతా దళం యొక్క చిహ్నం:
Emblem of the Border Security Force |
చరిత్ర:
1965 వరకు భారతదేశ సరిహద్దుల రక్షణ బాధ్యతను ఆయా రాష్ట్రాల స్థానిక పోలీసులు నిర్వహించేవారు. 1965 ఏప్రిల్ 9 న కచ్ లోని సర్దార్ పోస్ట్, చార్ బెట్ మరియు బెరియా బెట్ పై పాకిస్తాన్ దాడి చేసింది. సాయుధ దురాక్రమణను ఎదుర్కోవటంలో రాష్ట్ర సాయుధ పోలీసుల యొక్క అసమర్థతను ఇది బహిర్గతం చేసింది. దీని కారణంగా భారత ప్రభుత్వం ప్రత్యేక కేంద్రీకృత నియంత్రిత సరిహద్దు భద్రతా దళం యొక్క అవసరాన్ని భావించింది. కార్యదర్శుల కమిటీ సిఫారసుల ఫలితంగా, సరిహద్దు భద్రతా దళం 1965 డిసెంబర్ 01 న స్థాపించబడింది.
వాఘా బార్డర్ వేడుక:
- వాఘా సమీపంలో భారత పాకిస్తాన్ సరిహద్దులో ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి రెండు గంటలముందు ఈ కార్యక్రమం జరుగుతుంది.
- ఈ కార్యక్రమాన్ని వాఘా బార్డర్ వేడుక (Wagah border ceremony) లేదా బీటింగ్ రిట్రీట్ వేడుక లేదా జాతీయ పతాకం అవనతం చేసే కార్యక్రమం (flag lowering ceremony) అని కూడా పిలుస్తారు.
- 1959 నుండి ఈ ఆనవాయితీ ఉన్నది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికులు మరియు పాకిస్తాన్‌కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు.
- సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకు దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ గగుర్పొడిచే కార్యక్రమాన్ని ఇరుదేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు.
- పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని వాఘా (Wagah) బార్డర్ అని పిలుస్తారు. కాగా భారతీయులు ఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న అట్టారి (Attari) అనే గ్రామం పేరుతో దీనిని అట్టారి బార్డర్ అని పిలుస్తారు.