Banner 160x300

International Human Rights Day in Telugu



అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం December 10
History of International Human Rights Day
అంతర్జాతీయ మానవ హక్కుల
దినోత్సవం - December 10

మానవ హక్కులు:
  • మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమైనప్పుడే అవి అర్థవంతమవుతాయి. జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి. వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.
లక్ష్యం:
  • ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు తమ హక్కులేంటో తెలియజెప్పడం, అవసరమైన సహకారం అందించడం.
  • వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం లక్ష్యం.

ఎప్పటి నుండి?
  • 1950 డిసెంబర్ 04 న UNO జనరల్ అసెంబ్లీ 317 వ ప్లీనరీ సమావేశంలో 423 (V) తీర్మానాన్ని ఆమోదించిన తరువాత, అన్ని రాష్ట్రాలను మరియు ఆసక్తిగల సంస్థలను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 ను మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.

డిసెంబర్ 10నే ఎందుకు?
  • 1948 డిసెంబరు 10న  పారీస్ నగరంలో ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన(Universal Declaration of Human Rights) చేసింది. అందువల్ల డిసెంబర్‌ 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల  దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటారు. 
  • క్రీ.శ.1215లో ఇంగ్లండ్ రాజు జాన్ విడుదల చేసిన మాగ్నా కార్టా మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన. 

శతాబ్దాల నాటి ఆలోచన:
  • మానవ హక్కుల భావనను కేవలం రెండో ప్రపంచ యుద్ధానంతరం వచ్చిన ఆలోచనగా భావిస్తున్నారు . వాస్తవానికి హక్కుల భావన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన (1776) లో ఒక ముఖ్య నినాదం. ఫ్రెంచి విప్లవ ప్రకటన (1789) కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.

లోగో:
History of International Human Rights Day in Telugu
Human Rights Logo
  • దీనిని 2011 సెప్టెంబర్ 23న న్యూయార్క్ లో ఆవిష్కరించారు.

థీమ్(Theme):
  • 2019: Youth Standing Up for Human Rights
  • 2018: Stand Up For Human Rights
  • 2017: Let’s stand up for equality, justice and human dignity
  • 2016: Stand up for someone’s rights today

దక్షిణాఫ్రికాలో మానవ హక్కుల దినం - మార్చి 21:
  • 1920 నుంచి నల్లజాతి దక్షిణాఫ్రికన్లు అనుమతి చట్టాల (Pass Laws) ద్వారా నియంత్రించబడ్డారు. దీనికి వ్యతిరేకంగా 1960 మార్చి 21 న దక్షిణాఫ్రికాలో ఉన్న షార్ప్‌విల్లే పట్టణ ప్రాంత పోలీసు స్టేషను‌ వద్ద 5000 నుంచి 7000 వరకు ఉండే జన సమూహం గుమిగూడి ఆంధోళన చేయడం  ప్రారంభించారు. వీరిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 69 మంది మరణించారు. 180 మందికి పైగా గాయాలైయాయి.
  • షార్ప్‌విల్లే మారణకాండ(Sharpeville massacre) కు గుర్తుగా 1994 నుంచి మార్చి 21 ను దక్షిణాఫ్రికాలో మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
  • ఈ మారణకాండకు గుర్తుగా మార్చి 21ను అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలనా దినోత్సవంగా(International Day for the Elimination of Racial Discrimination) UNESCO 1966లో ప్రకటించింది.

మానవ హక్కుల కమిషన్‌లు:
  • మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.

United Nations Commission on Human Rights (UNCHR):
  • UNCHR 1946లో ECOSOC (Economic and Social Council) చేత స్థాపించబడింది.
  • ఇది మొదటిసారి జనవరి 1947 లో సమావేశమై మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన కోసం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఈ కమిటి యొక్క ముసాయిదాను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10 న స్వీకరించి, విశ్వమానవ హక్కుల ప్రకటన(Universal Declaration of Human Rights) చేసింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్‌(NHRC-National Human Rights Commission of India):
  • పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా మన దేశంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ 1993లో ఏర్పాటు చేసింది. ఇది మానవ హక్కుల రక్షణ చట్టం - 1993 నిబంధనల మేరకు పనిచేస్తుంది.
  • ఇది 1994 జనవరి 8 నుండి అమలులోకి వచ్చింది.
  • జాతీయ మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించడం జరిగింది. ఇదే చట్టాన్ని రాష్ట్రాలకు వర్తింపచేస్తూ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా సవరించారు.
  • ఛైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
  • జాతీయ మానవ హక్కుల కమీషన్ తొలి ఛైర్మన్ - జస్టిస్ రంగనాథ్ మిశ్రా (1993 – 96) 
  • 7వ ఛైర్మన్ - జస్టిస్ H.L.దత్తు (2016 - )

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(SHRC- State Human Rights Commission):
  • ఆంధ్రప్రదేశ్ లో 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనల మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ఏర్పాటుచేసారు.
  • ఛైర్మన్ మరియు సభ్యులను గవర్నర్ నియమిస్తారు.

Amnesty International(అమ్నెస్టీ ఇంటర్నేషనల్):
  • ఇది ఒక స్వచ్చంద సంస్థ(NGO).
  • ఈ సంస్థను 1961లో బ్రిటన్ న్యాయవాది పీటర్ బెన్సన్  స్థాపించాడు.
  • దీని ప్రధాన కార్యాలయం లండన్ లో ఉంది.
  • ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం.
  • ఈ సంస్థ నోబెల్ శాంతి బహుమతిని 1977లో పొందింది.
  • ఈ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడిన తొలి ఇండియన్ - సలీల్ శెట్టి (2010-2018).

మరికొన్ని అంశాలు:
  • విశ్వమానవ హక్కుల ప్రకటన(UDHR - Universal Declaration of Human Rights) ప్రపంచంలోనే అత్యంత అనువదించబడిన పత్రం. ఇది 500 కి పైగా భాషలలో లభిస్తుంది.
  • UDHR రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.